సోషల్ మీడియాలో ఈ మధ్య డిజాస్టర్ సినిమాలపై మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. ఆ వీడియోస్ చూస్తూ జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి ఆచార్య పై గట్టి ట్రోల్ వీడియోస్ వచ్చాయి. పాదఘట్టం అంటూ ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేసి కొరటాల , చిరంజీవిలతో మీమర్స్ సోషల్ మీడియాలో జనాలకి మంచి ఎంటర్టైన్ మెంట్ ఇచ్చారు. ఏజెంట్ , లైగర్ వంటి డిజాస్టర్స్ ను కూడా గట్టిగా ట్రోల్ చేసి వదిలారు.
ఇక మెహర్ పుణ్యమా అని ఇప్పుడు చిరు సినిమాకి మళ్ళీ మాస్ ట్రోలింగ్ జరుగుతుంది. ‘భోళా’ మొదటి రోజు మార్నింగ్ షోతోనే నిరాశ పరచడంతో మెహర్ తో ఈ సినిమాను చేసిన చిరును గట్టిగా విమర్శిస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు భోళా శంకర్ థియేటర్స్ లో నుండి బయటికి వచ్చేశాం అంటూ అసెంబ్లీ నుండి బయటికి వెళ్లిపోతున్న జగన్ వీడియోస్ లాంటివి పోస్ట్ చేస్తున్నారు.
మెహర్ రమేష్ ను మెగా ఫ్యాన్స్ సైతం ఒక ఆట ఆడుకుంటున్నారు. చిరు మంచి అవకాశం ఇస్తే దాన్ని చేజేతులారా పాడుచేసుకున్నాడని మెగా అభిమానులు ఆగ్రహం చూపిస్తున్నారు. మెహర్ పై వస్తున్న ట్రోలింగ్ వీడియోస్ నెటిజన్లకి మంచి ఎంటర్టైన్ మెంట్ అందిస్తున్నాయి. ఏదేమైనా ఈరోజుల్లో హిట్టయిన విరూపాక్ష లాంటి సినిమాలనే రిలీజ్ తర్వాత శాసనాల గ్రంధం అంటూ చాలా ట్రోల్ చేశారు. మరి డిజాస్టర్ ను ఎలా వదిలేస్తారు ? ఏదేమైనా మెహర్ రమేష్ భోళా తో ట్రోలర్స్ కి గట్టిగా దొరికేసినట్టే.
This post was last modified on August 11, 2023 7:12 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…