మెగాస్టార్ చిరంజీవి…తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా అభిమానులు కీర్తిస్తున్న అగ్ర నటుడు. అటు పాత తరానికి…ఇటు కొత్త తరానికి మధ్య వారధిగా నిలిచిన వాల్తేరు వీరయ్య. ఒక కుటుంబంలో తండ్రి, కొడుకు ఇద్దరూ చిరంజీవికి కరుడుగట్టిన అభిమానులుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు తెరను దశాబ్దాల పాటు ఏలిన స్టార్ హీరోగా, రాజకీయాలలో ఎత్తుపల్లాలు చూసిన రాజకీయ నేతగా..బ్లడ్ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలతో ఒక సామాజిక కార్యకర్తగా చిరంజీవి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.
అందుకే సందర్భానుసారంగా చిరుపై మెగా అభిమానులు తమ అభిమానాన్ని వినూత్న తరహాలో వ్యక్తీకరిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం విడుదల సందర్భంగా ఆయన అభిమానులు ఆయనకు ఒక పెద్ద ట్రీట్ ఇచ్చారు. చిరుపై తమ అభిమానం వెలకట్టలేనిది అని మరోసారి మెగా ఫ్యాన్స్ వినూత్న రీతిలో నిరూపించుకున్నారు. ఏకంగా గూగుల్ మ్యాప్స్ లో చిరంజీవి చిత్రాన్ని గీసి నభూతో నా భవిష్యత్తు రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్ మ్యాప్స్ లో ‘గ్యాంగ్ లీడర్’ ను చిత్రీకరించిన మెగా ఫాన్స్ ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ నగర గూగుల్ మ్యాప్స్ లో చిరంజీవి చిత్రాన్ని గీసేందుకు మెగా అభిమానులు కొందరు వినూత్న ప్రయోగాన్ని కొద్ది రోజుల క్రితం మొదలుపెట్టారు. చిరంజీవి ఫోటోను పోలిన రూట్ మ్యాప్ ను 15 రోజుల క్రితం ఎంచుకున్నారు. మొత్తం 800 కిలోమీటర్ల మేర చెక్ పాయింట్స్ పెట్టుకొని…పదుల సంఖ్యలో చిరు అభిమానులు రకరకాల వాహనాలలో గూగుల్ నావిగేషన్ ఆధారంగా ఆ రూట్లో ప్రయాణించారు. ఆ మెగా అభిమానులు ప్రయాణించిన రూట్లన్నీ కలపగా గూగుల్ మ్యాప్స్ పై మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆవిష్కృతమైంది. దాదాపు 15 రోజులు పాటు శ్రమించి వినూత్న తరహాలో తమ అభిమానాన్ని చాటుకున్నారు మెగా ఫాన్స్.
భోళాశంకర్ విడుదల సందర్భంగా మెగాస్టార్ కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకోవాలనే ఇలా చేశామంటున్నారు మెగా అభిమానులు. ఇక, ఈ చిత్ర విడుదల, టికెట్ల రేట్లపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ గూగుల్ మ్యాప్ ఫొటో మెగా ఫ్యాన్స్ అందరిలో కొత్త జోష్ నింపింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
This post was last modified on August 11, 2023 3:13 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…