Movie News

ఆ ద‌ర్శ‌కుడికి సెంటిమెంటుగా మారిన ఆ న‌టి

కొంద‌రు ద‌ర్శ‌కులు త‌మ సినిమాల్లో హీరోయిన్ల‌ను రిపీట్ చేస్తే.. కొంద‌రేమో ఫ‌లానా క‌మెడియ‌న్ త‌న ప్ర‌తి సినిమాలో ఉండాల‌ని ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. ఈ విష‌యంలో స్నేహం మాత్ర‌మే కాదు.. సెంటిమెంట్లు కూడా ఉంటాయి. టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేనికి కూడా ఇప్పుడు ఓ న‌టి సెంటిమెంటుగా మారింది. ఆమె ఎవ‌రో కాదు.. త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. త‌మిళంలో హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసి టైం క‌లిసి రాక‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్, విల‌న్ రోల్స్ వైపు మ‌ళ్లింది శ‌ర‌త్ కుమార్ త‌న‌య‌.

ఈ మ‌ధ్య త‌మిళంలో కంటే కూడా తెలుగులో ఆమెకు డిమాండ్ పెరిగింది. వ‌ర‌లక్ష్మి నెగెటివ్ రోల్స్ చేసిన సినిమాలు వ‌రుస‌గా హిట్ట‌వుతుండ‌ట‌మే అందుక్కార‌ణం. ఆమెకు డిమాండ్ పెరిగేలా చేయ‌డంలో గోపీచంద్ పాత్ర కూడా కీల‌క‌మే.
గోపీచంద్‌కు చాన్నాళ్ల త‌ర్వాత పెద్ద హిట్ అందించిన క్రాక్ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి చేసిన జ‌య‌మ్మ పాత్ర ఎంత బాగా క్లిక్ అయిందో తెలిసిందే. త‌న‌ త‌ర్వాతి సినిమా వీర‌సింహారెడ్డిలోనూ వ‌ర‌ల‌క్ష్మికి కీల‌క పాత్ర ఇచ్చాడు గోపీ. ఆ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయింది.

వ‌ర‌ల‌క్ష్మి పాత్ర కూడా బాగా ప్ల‌స్ అయింది. దీంతో ఆమెను త‌న ల‌క్కీ ఛార్మ్‌గా భావించి.. త‌ర్వాతి సినిమాలోనూ త‌న‌కోసం ఒక పాత్ర క్రియేట్ చేశాడ‌ట గోపీ. డాన్ శీను, బ‌లుపు, క్రాక్ త‌ర్వాత గోపీ-ర‌వితేజ క‌ల‌యిక‌లో కొత్త సినిమా ఇటీవ‌లే అనౌన్స్ అయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే షూటింగ్ కూడా మొద‌లు కాబోతోంది. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. ఈ చిత్రానికి ఇంకా క‌థానాయిక ఖ‌రార‌వ్వ‌లేదు కానీ.. వ‌ర‌ల‌క్ష్మి మాత్రం ఒక ముఖ్య పాత్రకు ఓకే అయిపోయింద‌ట‌. వీర‌సింహారెడ్డి మూవీని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్సే ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది.

This post was last modified on August 11, 2023 9:42 am

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

20 minutes ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

2 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

3 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

3 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

5 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

7 hours ago