Movie News

చిరు సినిమాకు ఇలాంటి పరిస్థితా?

మెగాస్టార్ చిరంజీవి 2007లో ‘శంకర్ దాదా జిందాబాద్’తో సినిమాల నుంచి బ్రేక్ తీసుకునే వరకు టాలీవుడ్లో ఆయన మకుటం లేని మహారాజు. చిరు ఎలాంటి సినిమా చేసినా సరే.. రిలీజ్ ముంగిట యుఫోరియానే వేరుగా ఉండేది. చిరు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్ సంపాదించడం అప్పటికి పెద్ద టాస్కులా ఉండేది. ఆయన పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే సమయానికి ఆన్ లైన్ బుకింగ్స్ వచ్చేసి.. టికెట్ల కోసం థియేటర్ల ముందు చొక్కాలు చించుకోవాల్సిన, లాఠీ దెబ్బలు తినాల్సిన కష్టం తప్పింది.

అయినా సరే.. ఆన్ లైన్లో టికెట్ సంపాదించడం అంత తేలిక కాదన్న పరిస్థితే ఉంది. ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా’ సినిమాలకు హైప్ దృష్ట్యా తొలి రోజు షోలకు కొన్ని గంటల్లో టికెట్లు అయిపోయాయి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలకు హైప్ కొంచెం తగ్గినా.. బుకింగ్స్ బాగానే జరిగాయి. కానీ ‘వాల్తేరు వీరయ్య’కు మళ్లీ టికెట్ల కోసం జనం ఎగబడ్డారు. సంక్రాంతి రిలీజ్ కావడం దానికి పెద్ద ప్లస్ పాయింట్.

‘వాల్తేరు వీరయ్య’ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరు సినిమా అంటే అంచనాలు ఎక్కువే ఉండాలి. కానీ ఒక రొటీన్ మాస్ సినిమాకు రీమేక్ కావడం, పైగా మెహర్ రమేష్ డైరెక్ట్ చేయడం వల్ల ‘భోళా శంకర్’పై అంచనాలు పెద్దగా లేవు. అయినా సరే.. చిరు చరిష్మా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని.. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగానే జరుగుతాయని అనుకున్నారు. కానీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. హైదరాబాద్ సిటీలో బుకింగ్స్ ఓపెన్ అయిన ఐదారు రోజుల తర్వాత కూడా ఫుల్ కాని షోలు వందల్లో ఉన్నాయి.

ఫుల్ అయిన షోలు చాలా తక్కువగా కనిపిస్తుున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ల్లో ‘భోళా శంకర్’ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. ఇలాంటి సినిమాకు 330 పెట్టి టికెట్ బుక్ చేసుకుని ఏం వెళ్తాం అన్నట్లు ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నారు. సింగిల్ స్క్రీన్లలో పరిస్థితి మెరుగే కానీ.. వాటిలోనూ ఫుల్ అయిన షోలు తక్కువే. ఇన్నేళ్ల ఉజ్వల కెరీర్లో ఇంత లో బజ్ ఉండి, టికెట్ల కోసం ఇంత తక్కువ డిమాండ్ ఉన్న సినిమా మరొకటి లేదు అంటే అతిశయోక్తి లేదు.

This post was last modified on August 10, 2023 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago