కోలీవుడ్ లోనే కాదు మన దగ్గరా మంచి ఫాలోయింగ్ ఉన్న ధనుష్ ఈ ఏడాదే సర్ రూపంలో టాలీవుడ్ స్ట్రెయిట్ ఎంట్రీ ఇచ్చి మొదటి విజయం అందుకున్నాడు. తమిళంలో కన్నా తెలుగులోనే బాగా ఆడిన సర్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి దీనికన్నా ముందు ఫ్లాప్ ఉన్నా సరే కేవలం కథను నమ్మడం వల్లే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు మరో దర్శకుడు అదే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. విరాట పర్వంతో ప్రశంసలు దక్కించుకున్నా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అందుకున్న వేణు ఊడుగుల ఇటీవలే ఒక లైన్ చెప్పాడట. నచ్చింది కానీ ఫుల్ వెర్షన్ కు ధనుష్ టైం ఇచ్చినట్టు తెలిసింది.
వరసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ కాంబోని సెట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. టేకింగ్ పరంగా వేణు ఊడుగుల మీద కంప్లయింట్ లేకపోయినా కమర్షియల్ అంశాలను ఎలా హ్యాండిల్ చేస్తాడనే కోణంలో అనుమానాలు లేకపోలేదు. మొదటి చిత్రం నీది నాది ఒకే కథ కూడా సీరియస్ నెరేషన్ తో సాగే ఒక సోషల్ ఇష్యూ కథ. కానీ ధనుష్ తో అలాంటివి వర్కౌట్ కావు. మాస్ టచ్ ఉండాల్సిందే. ఎంత మెసేజ్ ఉన్నా సర్ లో వీటిని వెంకీ అట్లూరి చాలా తెలివిగా ఇరికించాడు. అవి బాగా పేలాయి. వేణు ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తున్నారట.
కెప్టెన్ మిల్లర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న ధనుష్ ఇకపై ఏడాదికి ఒక తెలుగు సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. ఎలాగూ రెండు మూడు భాషల్లో రిలీజ్ చేస్తారు కాబట్టి దర్శకుడి కన్నా ముందు కథను బాగా వడబోత పట్టి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నాడు. యుగానికి ఒక్కడు సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్వీయ దర్శకత్వంలో తన 50వ సినిమా తీసుకుంటున్న ధనుష్ తో చేతులు కలిపేందుకు మన నిర్మాతలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి వాళ్ళు సైతం సరైన సబ్జెక్టుల కోసం చూస్తున్నారు. కాకపోతే అంత సులభంగా దొరకడం లేదు.
This post was last modified on October 8, 2023 4:32 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…