నిర్మాతల కంటే ఎక్కువ ప్రభాస్ బ్రాండ్ మీదే పేరు తెచ్చుకున్న యువి క్రియేషన్స్ ఆలస్యానికి పెట్టింది పేరని సినిమా ప్రేమికుల్లో ఒక అభిప్రాయం ఉంది. ఒక ట్విట్టర్ అప్డేట్ తో మొదలుపెట్టి అసలు రిలీజ్ డేట్ దాక వాయిదాలు వేస్తూనే ఉంటారని డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటారు. సరే ప్యాన్ ఇండియా మూవీస్ అంటే ఇలాంటి సమస్యలు సహజం కాబట్టి ఏదోలే అనుకోవచ్చు. కానీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి మీడియం బడ్జెట్ చిత్రానికి సైతం ఇబ్బందులు తప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఆగస్ట్ 2 ఈ జంట థియేటర్లకు రావాల్సింది.
కానీ వారం గ్యాప్ లో మెగాస్టార్ సూపర్ స్టార్ ఇద్దరూ వస్తున్నారని కారణమో లేక ప్రమోషన్లకు వచ్చేందుకు సరిపడా టైం అనుష్క వద్ద లేకపోవడమో ఏదైతేనేం మొత్తానికి పోస్ట్ పోన్ తప్పలేదు. పోనీ ఆగస్ట్ 18న ప్లాన్ చేసుకుంటే పోటీ లేని సమయం చాలా ప్లస్ అయ్యేది. కానీ వదిలేశారు. తీరా చూస్తే ఆ శుక్రవారం చెప్పుకోదగ్గ మంచి రిలీజ్ ఏదీ లేదు. సుహైల్ మిస్టర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పటికీ దానికి ఎలాంటి బజ్ ఉందో తెలిసిందే. ఆపై ఆగస్ట్ 25 వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున ఉంటుంది కాబట్టి రిస్క్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక నో ఆప్షన్ కనక సెప్టెంబర్ కు షిఫ్ట్ అవ్వాలి.
మొదటి వారం మొదటి రోజే విజయ్ దేవరకొండ ఖుషి ఉంది. దాంతో క్లాష్ ఓవర్సీస్ మార్కెట్ పరంగా అంత సేఫ్ కాదు. పోనీ సెప్టెంబర్ 7న ప్లాన్ చేసుకుందామంటే షారుఖ్ ఖాన్ జవాన్ కవ్విస్తున్నాడు. అన్ని భాషల్లో రిలీజ్ ఉండటంతో భారీ ఎత్తున మార్కెటింగ్ చేస్తున్నారు. కానీ యువి మాత్రం ఈ డేట్ కే మొగ్గు చూపుతోందని ఇన్ సైడ్ టాక్. ఎందుకంటే 15న స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలున్నాయి. అదింకా డేంజర్. సో ఎలా చూసుకున్నా పోలిశెట్టి జంట సెప్టెంబర్ 7నే వచ్చేలా ఉంది. టీమ్ తో మాట్లాడుకుని మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.
This post was last modified on August 10, 2023 10:58 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…