Movie News

‘భోళా శంకర్’ వెనుక ఎవరెవరున్నారు?

ఇంకొక్క రోజు వ్యవధిలో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ ‘వేదాళం’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే ఇది రొటీన్ మాస్ మూవీ కావడం.. పైగా ఎనిమిదేళ్ల కిందట రిలీజ్ కావడం.. శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు ఇచ్చి పదేళ్లుగా సినిమాలు తీయని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మరీ అంచనాలేమీ లేవు.

పైగా టీజర్, ట్రైలర్ చూసి నెగెటివ్‌గా స్పందించిన వాళ్లే ఎక్కువ. ఐతే మెహర్ రమేష్ మాత్రం ‘భోళా శంకర్’ సూపర్ హిట్ అవడం పక్కా అంటున్నాడు. చిరంజీవి సినిమా నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో అవన్నీ ఉన్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘భోళా శంకర్’ రీమేక్ అయినప్పటికీ.. దాంతో పోలిస్తే చాలా మార్పులు చేర్పులు చేశామని.. ఒరిజినల్ కన్నా బెటర్‌గా సినిమా తయారైందని.. అందులో తన టీం కృషి ఉందని మెహర్ చెప్పాడు.

‘భోళా శంకర్’ వెనుక చాలా బుర్రలు పని చేసినట్లు మెహర్ వెల్లడించాడు. సీనియర్ రైటర్ సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ పర్యవేక్షణ చేశారని.. ‘వకీల్ సాబ్’కు మాటలు రాసిన మామిడాల తిరుపతి స్క్రిప్టుతో పాటు మేకింగ్ విషయంలో కీలక పాత్ర పోషించాడని మెహర్ వెల్లడించాడు. ‘వకీల్ సాబ్’లో తెలంగాణ స్లాంగ్ డైలాగులను తిరుపతి బాగా రాశాడని.. దీంతో ‘భోళా శంకర్’లో చిరు పాత్రకు ఆ యాసలోనే తనతో డైలాగులు రాయించామని మెహర్ తెలిపాడు. చిరు పాత్ర హైదరాబాద్‌లో ఉన్నంత వరకు ఈ స్లాంగ్‌లో మాట్లాడుతుందని.. కలకత్తా నేపథ్యంలో సాగే కథలో మామూలుగా యాసే ఉంటుందని మెహర్ తెలిపాడు.

ఇక ‘టచ్ చేసి చూడు’తో దర్శకుడిగా మారిన విక్రమ్ సిరికొండ కూడా తన రైటింగ్ టీంలో కీలక వ్యక్తి అని.. కన్నన్ అనే మరో రైటర్ కూడా ఈ సినిమాకు పని చేశాడని మెహర్ వెల్లడించాడు. తన మిత్రులైన హరీష్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్లు తనకు సక్సెస్ రావాలన్న ఉద్దేశంతో ఈ సినిమాకు రైటింగ్ సాయం చేయడానికి ముందుకు వచ్చారని.. ఒక వెర్షన్ కావాలన్నా రాసి ఇస్తామన్నారని.. కానీ తాను వారి సాయం తీసుకోకుండా తన టీంతోనే పని చేశానని మెహర్ చెప్పాడు.

This post was last modified on August 9, 2023 9:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైలు వరకు వెళ్లిన కస్తూరి కేసు

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…

25 mins ago

పుష్ప 3 లో యాక్ట్ చేస్తావా? : తిలక్ ఏమన్నాడంటే…

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…

4 hours ago

‘దళపతి విజయ్’ : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా..

కోలీవుడ్‌లో చిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాదించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు…

4 hours ago

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

7 hours ago

కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…

9 hours ago