‘ఖుషి’ పోస్టర్ మీద విజయ్ దేవరకొండ పేరుకి ముందు ‘ది’ అనే అక్షరం చేరడంతో అప్పట్లో యాంకర్ అనసూయ చేసిన కామెంట్ వైరల్ అయ్యాయి. అక్కడి నుండి అనసూయ ని రెచ్చగొడుతూ విజయ్ ఫ్యాన్స్ ది అంటూ నొక్కి పెట్టి మరీ రివర్స్ కౌంటర్ వేశారు. అయితే ఉన్నపళంగా తన పేరుకి ముందు ది అనే అక్షరం ఎందుకు చేరిందనే ప్రశ్న తాజాగా ఖుషి ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ కి మీడియా నుండి ఎదురైంది. దీంతో ఆ అక్షరం పెట్టుకోవడానికి కారణం చెప్పుకున్నాడు విజయ్.
ఏదో ఒక పేరు పెట్టకోమని ప్రెజర్ పెరిగింది.వద్దురాఅని కొట్లాడితే ఇష్టం వచ్చినట్టు రౌడీ స్టార్ అని సౌత్ సెన్సేషన్ అని రాస్తున్నారు. అదొక భయం కొత్తగా ఏం అంటిస్తారో అని , లైగర్ టైమ్ లో పూరీ గారు నీ పేరు కి ముందు ఏదో ఒకటి పెట్టాలి అంటూ రెండు మూడు పేర్లు చెప్పారు. నాకు అలా ట్యాగ్ ఇష్టం లేదు. నాకు విజయ్ దేవరకొండ సరిపోతుందని భావించి ఫైనల్ గా పేరుకి ముందు ది అని పెట్టుకున్నాను.
విజయ్ దేవరకొండ ఒక్కడే ఉన్నాడు వాడు ది విజయ్ దేవరకొండ అంతే. ఇదే కారణం ఇంతకు మించి ఏమి లేదంటూ విజయ్ క్లారిటీ ఇచ్చాడు. ఇదే ఈవెంట్ లో నటి అనసూయ కి మీకు ఏంటి ? గొడవ అనే క్వశ్చన్ కూడా విజయ్ కి వచ్చింది. ఆ విషయం గొడవ పడే వాళ్ళని అడగాలి ఎందుకు గొడవ పడుతున్నారో అంటూ కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు విజయ్. అసలు తనకి ఏం నడుస్తుందో ? ఎందుకు నడుస్తుందో ? తనకి తెలియాదని అన్నాడు.
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…