మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ ‘గుంటూరు కారం’కి అన్నీ అడ్డంకులే. షూటింగ్ మొదలు పెట్టే ముందు నుండి ఇప్పటి వరకూ ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది. మొదట అనుకున్న స్క్రిప్ట్ మారింది, తర్వాత హీరోయిన్ మారింది, తాజాగా కెమెరా మెన్ మారాడు. అలాగే తమన్ కూడా మారే అవకాశం ఉందనే టాక్ బయటికొచ్చింది. మళ్ళీ ఏమైందో టీం తమన్ రీప్లేస్ మెంట్ గురించి ఏ లీకు రాకుండా చూసుకున్నారు. తమన్ మాత్రం తనే మ్యూజిక్ ఇస్తున్నాని , వర్క్ జరుగుతుందని చెప్తున్నాడు.
ఈ సినిమా మధ్యలో మహేష్ తమన్ లకి చెడిందని ఇన్సైడ్ టాక్. తమన్ వర్క్ మీద మహేష్ డిస్సాటిస్ఫాక్షన్ గా ఉన్నాడని ప్రస్తుతం తమన్ మరో రెండు కొత్త పాటలు రెడీ చేశాడని అంటున్నారు. మహేష్ ప్రస్తుతం కుటుంబం తో వెకేషన్ లో ఉన్నాడు. ఈ నెల 12న తిరిగి ఇండియా రానున్నాడు. వచ్చిన వెంటనే మహేష్ కి తమన్ సాంగ్స్ వినిపించనున్నాడట త్రివిక్రమ్. మహేష్ రియాక్షన్ ను బట్టే తమన్ ఉంటాడా లేదా అనేది నిర్ణయిస్తారు. త్రివిక్రమ్ మాత్రం తమన్ ను ప్రాజెక్ట్ లో ఉంచే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారని అంటున్నారు.
మహేష్ బర్త్ డే సందర్భంగా వదిలిన పోస్టర్ లో కూడా తమన్ పేరే ఉంది. అంటే ప్రాజెక్ట్ లో తమన్ ఉన్నట్టే… కానీ ఫస్ట్ సింగిల్ వచ్చే వరకూ ఫ్యాన్స్ లో మాత్రం నమ్మకం లేదు. ఏదేమైనా మహేష్ ఫ్యాన్స్ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అన్నిటికీ సమాదానం దొరకాలంటే ఆల్బమ్ నుండి మొదటి పాట బయటికి రావాల్సిందే. ఏదేమైనా తమన్ కి మాత్రం ఈ సినిమా పెద్ద ఛాలెంజే.
This post was last modified on August 9, 2023 8:58 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…