ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ‘గుంటూరు కారం’ సినిమా మీద వచ్చినన్ని నెగెటివ్ న్యూస్‌లు, రూమర్లు మరే పెద్ద సినిమా మీద రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు జరిగిన సంగతి తెలిసిందే. స్క్రిప్టు మారడమే కాక వేర్వేరు దశల్లో ఫైట్ మాస్టర్లు, హీరోయిన్, సినిమాటోగ్రాఫర్‌లను కూడా మార్చాల్సి వచ్చింది.
వీరితో పాటు సంగీత దర్శకుడు తమన్ కూడా సినిమా నుంచి వైదొలగనున్నట్లు ప్రచారం ఒకసారి కాదు.. రెండు మూడుసార్లు జరిగింది. కొన్ని రోజుల ముందు కూడా తమన్‌పై వేటు పడినట్లు జోరుగా రూమర్లు వినిపించాయి. ఐతే బుధవారం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లో తమన్ పేరు కనిపించడంతో ఈ ప్రచారానికి తెరపడింది. ఈ దశలో ఇక సంగీత దర్శకుడిని మార్చరనే అందరూ భావిస్తున్నారు. ఒకవేళ ఒకట్రెండు పాటలు వేరే సంగీత దర్శకుడితో చేయించుకుంటే చెప్పలేం.
ఐతే తమన్ ‘గుంటూరు కారం’లో ఉన్నాడని ధ్రువీకరించారు బాగానే ఉంది కానీ.. ఇంకో నాలుగు నెలల్లో సినిమా రిలీజ్ ఉండగా.. మహేష్ పుట్టిన రోజు లాంటి మంచి సందర్భం వచ్చినపుడు కేవలం ఒక పోస్టర్‌తో సరిపెట్టడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి ఈ సందర్భంలో సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేస్తారని కొన్ని రోజుల ముందు జోరుగా ప్రచారం జరిగింది. తమన్ కూడా ఆ పనిలోనే ఉన్నట్లు చెప్పుకున్నారు. ఐతే తమన్ పట్ల మహేష్ ఈ మధ్య అంత సానుకూలంగా లేని నేపథ్యంలో ఆయనకు నచ్చి ఓకే చేస్తేనే బయటికి వస్తుందని మాట్లాడుకున్నారు.
తీరా చూస్తే.. మహేష్ బర్త్‌డేకి పాట రాలేదు. అంటే తమన్ పాటే సిద్ధం చేయలేదా.. లేక అతను రెడీ చేసినా మహేష్‌కు నచ్చకపోవడంతో ఆపేశారా అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమన్‌ను మున్ముందు అయినా తప్పించి మరో సంగీత దర్శకుడిని పెట్టుకుంటారేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. తమన్ పేరు పోస్టర్ మీద లేకుంటే ఫోకస్ అంతా దాని మీదికే మళ్లి మహేష్ పుట్టిన రోజు నాడు అనవసర రచ్చ జరుగుతుందని కూడా వివాదానికి ఆస్కారం లేకుండా తమన్ పేరు పోస్టర్ మీద వేసి ఉండొచ్చనే చర్చ కూడా నడుస్తోంది.
This post was last modified on August 9, 2023 4:54 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…