యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండకు లైగర్ ఇచ్చిన షాక్ పెద్దదే అయినా వెంటనే కోలుకుని తన నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో అలాంటి కథతోనే ఖుషి చేయడం అంచనాలు పెంచుతూ వచ్చింది. టక్ జగదీశ్ ఫలితం ఎలా ఉన్నా దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి, మజిలీతో సాధించిన విజయాలు మూవీ లవర్స్ లో ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చాయి. ఈ కాంబోకి సమంతా తోడవ్వడంతో హైప్ ఆటోమేటిక్ గా పెరిగిపోయింది. ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన లాంచ్ ఈవెంట్ లో ఖుషి ట్రైలర్ ని ఆవిష్కరించి కథ ఏంటో స్పష్టంగా చెప్పేశారు
కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన విప్లవ్(విజయ్ దేవరకొండ) అక్కడో ముస్లిం అమ్మాయి(సమంతా) ని చూసి ఇష్టపడతాడు. పరిచయం ప్రేమగా మారుతున్న టైంలో ఆమె స్వచ్ఛమైన బ్రాహ్మణ కులానికి చెందిన ఆరాద్య అని తెలుసుకుని షాక్ అవుతాడు. క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన విప్లవ్ రెండు కుటుంబాలకు ఇష్టం లేకపోయినా తామేంటో ఋజువు చేస్తామని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వేరు కాపురం పెడతాడు. మొదట్లో బాగానే ఉన్నా మెల్లగా ఈ జంట మధ్య చిన్న చిన్న అపార్థాలు మొదలవుతాయి. పెద్దలు భయపడిందే జరుగుతుంది కానీ విప్లవ్ ఆరాధ్యల సంకల్పం వేరే ఉంటుంది. అందులో గెలవడమే ఖుషి.
దర్శకుడు శివ నిర్వాణ కూల్ ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్ టైనర్ గా ఖుషిని రూపొందించినట్టు అర్థమవుతోంది. విజయ్ సామ్ కెమిస్ట్రీ స్క్రీన్ మీద బాగుంది. గీత గోవిందం తర్వాత మళ్ళీ అలాంటి షేడ్స్ లో రౌయ్ బాయ్ ని చూడటం కుటుంబ ప్రేక్షకులను చేరువ చేసేలా ఉంది. క్యాస్టింగ్ పెద్దదే ఉంది. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం మంచి ఫీల్ ని తీసుకొచ్చింది. మొత్తానికి ఊహించినట్టే ఖుషిలో అన్ని ఎలిమెంట్స్ ని మంచి ప్లానింగ్ తో మిక్స్ చేసిన శివ నిర్వాణ సినిమా మొత్తం కూడా ఇలాగే తీసుంటే హీరో, హీరోయిన్, దర్శకుడు ముగ్గురూ కోరుకున్న బ్లాక్ బస్టర్ ఖాయం చేసుకోచ్చు.
This post was last modified on August 9, 2023 4:41 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…