ఎంత పెద్ద స్టార్ అయినా సరే కొత్త సినిమా రిలీజ్ అవుతోందంటే అదో రకమైన ఉద్వేగం ఉంటుంది. ఫలితం ఎలా వస్తుందోననే టెన్షన్ తో సరిగా నిద్ర పట్టదు. వరుసగా ఫోన్ కాల్స్ తో నిమిషం గ్యాప్ దొరకదు. ఇక ప్రమోషన్ల కోసం ఇంటర్వ్యూలు, ఈవెంట్లు గట్రా ఎన్నో ఉంటాయి. మొదటి రోజు మార్నింగ్ షో దాకా టెన్షన్ షరా మాములే. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అవేవి పట్టవు. దర్శకుడు కోరుకున్నట్టు నటించి తన కర్తవ్యం నిర్వర్తించాను కాబట్టి ఇంకా నాకు దేనితోనూ సంబంధం లేదన్న రీతిలో వ్యవహరిస్తూ ఉంటారు. దాని నుంచి జైలర్ కు సైతం మినహాయింపు ఇవ్వలేదు.
ఇంకో ఇరవై నాలుగు గంటల్లో ప్రీమియర్లు మొదలవుతాయనగా రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లిపోయారు. తరచుగా ఈ పర్యటన ఆయనకు అలవాటే అయినా ఇటీవలి కాలంలో ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువగా వెళ్ళలేదు. నాలుగేళ్లకు పైగా గ్యాప్ వచ్చిందట. అందుకే ప్రశాంతత కోసం కొన్ని రోజులు అక్కడ గడిపి వస్తారట. ఈలోగా జైలర్ ఇక్కడ ఫైనల్ రన్ పూర్తి చేసుకుని రికార్డుల లెక్క తేల్చేసి ఉంటుంది. ఇటీవలే చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజని ఇచ్చిన గంటన్నర స్పీచ్ తాలూకు వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆయన సంగతేమో కానీ అన్ని భాషల్లో జైలర్ కు మంచి బజ్ కనిపిస్తోంది. ట్రైలర్ కట్ తో పాటు అనిరుద్ పాటలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో భోళా శంకర్ కంటే రజనికే మంచి బుకింగ్స్ ఉండటం షాక్ కలిగిస్తోంది. రోబో తర్వాత మళ్ళీ యునానిమస్ అనిపించుకున్న అంత పెద్ద సక్సెస్ అందుకోలేకపోయిన తలైవర్ కి జైలర్ బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. దీని తర్వాత కూతురు దర్శకత్వంలో క్యామియో చేసిన లాల్ సలాం రిలీజ్ ఉంటుంది. జైభీం ఫేమ్ టిజె జ్ఞానవేల్ డైరెక్ట్ చేయబోయే మల్టీస్టారర్ దీపావళి నుంచి మొదలుకానుంది.
This post was last modified on August 9, 2023 4:33 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…