‘వేదాళం’ నాకే రాసిపెట్టుంది  

ఒక సినిమా ఒక హీరోతో అనుకొని మరొక హీరోతో చేయడం చాలా సార్లు చూశాం.  ‘భోళా శంకర్’ కూడా అదే కోవలోకి వస్తుంది. అజిత్ హీరోగా తమిళ్ లో వచ్చిన ‘వేదళం’ సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం తెలుగులో పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేసుకున్నారు. తమిళ దర్శకుడు KT నేసన్ ను పెట్టుకొని సినిమాను లాంచ్ చేశారు. పవన్ కూడా ముహూర్తంలో పాల్గొన్నాడు. కానీ కట్ చేస్తే పవన్ వేదాళం వదిలేసి మరో రీమేక్ ప్లాన్ చేసుకున్నాడు. 

అయితే ఈ రీమేక్ సినిమా తనకే రాసిపెట్టి ఉందని మెహర్ రమేష్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేదు అనే రీజన్ తనకి తెలియదదు. కానీ చిరంజీవి గారితో ఈ రీమేక్ చేసి నేను కం బ్యాక్ అవ్వాలని ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ తో రత్నం గారు చేయాలని అనుకున్నా చేయలేకపోయారని చెప్పుకున్నాడు మెహర్.  వేదాళంలో అన్నీ అంశాలు సమపాలల్లో ఉన్నాయి. హీరోయిజం, కామెడీ , సిస్టర్ సెంటిమెంట్ , ఇలా చాలా ఉన్నాయని , కథ కొందరికి తెలిసినా నా స్టైల్ లో ఈ సినిమా చేశానంటూ చెప్పుకున్నాడు మెహర్. 

ఇక సినిమాలో సిస్టర్ కేరెక్టర్ కోసం ముందు నుండి కీర్తి సురేష్ నే అనుకున్నామని , ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి నిర్మాత స్వప్న దత్ సహాయం తీసుకున్నాను, ఈ సందర్భంగా నేను సిస్టర్ గా భావించే స్వప్న కి థాంక్స్ చెప్పుకుంటున్నా,  స్వప్న సిస్టర్ ద్వారా సినిమాలో కీర్తి సిస్టర్ వచ్చిందని తెలిపాడు. ఈ రీమేక్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు మెహర్. తనకి హిట్లు ఇచ్చిన రీమేక్ వర్క్ మళ్ళీ తనని ట్రాక్ లోకి తీసుకొస్తుందని నమ్ముతున్నాడు. మరి మెహర్ ఆశలు భోళా తీరుస్తుందేమో చూడాలి.