Movie News

చిరు కెపాసిటీతో ముడిపెట్టొచ్చా?

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘భోళా శంకర్’కు తెలుగు రాష్ట్రాల్లోనే ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చిరు గత చిత్రాలతో పోలిస్తే చాలా డల్లుగా నడుస్తున్నాయి. ‘ఆచార్య’ ఎంత నిరాశపరిచినప్పటికీ.. దాని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇంత నెమ్మదిగా అయితే లేవు. హైదరాబాద్ లాంటి చోట కూడా ఈ సినిమా షోలు ఒకటీ అరా తప్ప సోల్డ్ ఔట్ చూపించట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇక యుఎస్‌లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని షోలకు టికెట్లు పదుల సంఖ్యలోనే తెగాయి. ఎక్కడా టికెట్ల అమ్మకాలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో లేవు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రిమియర్స్ నుంచే 7 లక్షల డాలర్ల దాకా కొల్లగొట్టిన చిరు.. ‘భోళా శంకర్’తో అందులో సగం కలెక్షన్లు రాబట్టడం కష్టంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్లు తక్కువ స్థాయిలో ఉండబోతున్నాయన్నది స్పష్టం.

‘వాల్తేరు వీరయ్య’తో రూ.135 కోట్ల షేర్ రాబట్టిన చిరుకు ‘భోళా శంకర్’తో రూ.100 కోట్ల షేర్ తెచ్చి బ్రేక్ ఈవెన్ చేయడం కూడా చాలా పెద్ద సవాల్‌లాగే కనిపిస్తోంది. ఐతే దీన్ని బట్టి చిరు రేంజ్ పడిపోయిందని.. ఆయన కెపాసిటీని తక్కువ అంచనా వేయడం మాత్రం కరెక్ట్ కాదు. కొందరు యాంటీ ఫ్యాన్స్ ఇదే ఛాన్స్ అని.. ‘భోళా శంకర్’కు సంబంధించిన నెగెటివ్ విషయాలన్నీ చూపించి చిరును ట్రోల్ చేయాలని చూస్తున్నారు.

ఒక రీమేక్.. పైగా రొటీన్ మాస్ సినిమా.. ‘శక్తి’, ‘షాడో’ లాంటి డిజాస్టర్లు ఇచ్చి పదేళ్లుగా సినిమాలు తీయని మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రం.. ఇలాంటి నేపథ్యంలో వస్తున్న ‘భోళా శంకర్’ను చూసి చిరు కెపాసిటీని అంచనా వేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఇంత నెగెటివిటీ ఉన్న సినిమాను యావరేజ్ స్థాయిలో నిలబెట్టినా కూడా చిరు గ్రేట్ అనిపించుకుంటాడు. అంతే తప్ప దీని వసూళ్ల లెక్కల్ని చూపించి చిరును తక్కువ అంచనా వేస్తే అంతకంటే తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు.

This post was last modified on August 8, 2023 4:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య వారధి అవుతా: దిల్ రాజు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…

35 minutes ago

కొత్త సంవత్సరానికి పాత సినిమాల స్వాగతం!

ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…

56 minutes ago

టెన్షన్ పడుతున్న తండేల్ అభిమానులు!

తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…

1 hour ago

ముగిసిన విచారణ..ఇంటికి వెళ్లిపోయిన అల్లు అర్జున్!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…

3 hours ago

శాలువాలతో డ్రెస్సులు..చింతమనేని ఐడియా అదిరింది

రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు…

3 hours ago

బందిపోట్లే కాదు…బంధాలూ హైలెటయ్యే డాకు

వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి 12 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా…

4 hours ago