కెరీర్ క్లైమాక్స్ కు వచ్చిందనుకుంటున్న టైంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ వారం తనకు మరీ ప్రత్యేకంగా నిలవబోతోంది. ఒకపక్క మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ ఆటా పాటా, మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ తో కావాలయ్యా అంటూ రచ్చ రచ్చ. రెండూ వర్కౌట్ అవుతాయనే ధీమా తనలో బాగా కనిపిస్తోంది. జైలర్ లో తమన్నా ఫుల్ లెన్త్ హీరోయిన్ కాదు. హీరో పాత్ర వయసు దృష్ట్యా రజనికి జోడిగా రమ్యకృష్ణ నటించారు. చాలాకాలం తర్వాత జైలుకు వచ్చిన రజనికి స్వాగతం చెప్పే క్రమంలో తమన్నా స్పెషల్ సాంగ్ వస్తుందన్న మాట.
దీంతో పాటు కొన్ని కీలకమైన సీన్లు ఉంటాయట. ఇక భోళా శంకర్ విషయంలో ఫుల్ లెన్త్ రోల్ కాబట్టి దాని ఫలితం మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దాలో బోల్డ్ సీన్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నాకు ఆఫర్ల వర్షం కురుస్తోంది. లైవ్ కన్సర్ట్ పెర్ఫార్మన్స్ లు, బడా షో రూమ్ ఓపెనింగులు, దర్శక నిర్మాతలతో స్టోరీ డిస్కషన్లు ఒకటా రెండా ఇంకో రెండు మూడేళ్ళ దాకా కాల్ షీట్స్ ఫుల్ గా బ్లాక్ అవుతున్నాయట. తెలుగు తమిళ అవకాశాలు సమాంతరంగా వస్తుండటంతో పదిహేను సంవత్సరాల ట్రాక్ రికార్డుకు మరింత తోడవుతోంది.
ప్రస్తుతం తమన్నా చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. మలయాళంలో బాంద్రా, హిందీలో వేదా, తమిళంలో అరన్మయి 4 సెట్స్ మీదున్నాయి. పైన చెప్పిన వెబ్ సిరీస్ ల కొనసాగింపులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ కొత్త ప్రాజెక్టులు ఇంకా సైన్ చేయలేదు. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో రూపొందబోయే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కు తన పేరే పరిశీలనలో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇది ఓకే అయితే బాలయ్య సరసన జోడి కట్టేయొచ్చు. మాములుగా దశాబ్దం దాటితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిన పరిస్థితిలో ఇంకా హీరోయిన్ గా వెలగడమంటే అదృష్టమే మరి.
This post was last modified on August 7, 2023 9:07 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…