ఇప్పటి తరానికి కాదు కానీ తొంబై దశకం వాళ్లకు బాగా పరిచయమున్న పేరు గంధపు చెక్కల దొంగగా ప్రసిద్ధి చెందిన వీరప్పన్. రెండు వేల సంవత్సరంలో శాండల్ వుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించడం ఎవరూ మర్చిపోలేరు. నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళలో వందలాది ప్రాణాలను అన్యాయంగా బలి తీసుకున్నఈ దుర్మార్గ దొంగ మీద చాలా సినిమాలు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ ఓ మూవీ తీశారు.. అంతకు ముందు కన్నడ, తమిళంలో చెప్పుకోదగ్గ చిత్రాలు వచ్చాయి. పుస్తకాలు, నవలలు ఎన్ని ఉన్నాయో లెక్క బెట్టడం కష్టం.
తాజాగా నెట్ ఫ్లిక్స్ ది హంట్ ఫర్ వీరప్పన్ పేరుతో నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీని తీసుకొచ్చింది. అతని భార్య ముత్తులక్ష్మి ఇంటర్వ్యూతో మొదలుపెట్టి అంత కారడవుల్లో ఎలా బ్రతికాడు, తప్పించుకున్నాడు లాంటి సంఘటనలను పూసగుచ్చినట్టు వివరించేలా పలువురు నిజమైన పోలీస్ ఆఫీసర్లతో చెప్పించిన సంగతులు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి, ఒరిజినల్ ఫోటోలు, వీడియోలు కొన్ని పొందుపరిచారు. అత్యంత పాశవికంగా ప్రవర్తించే వీరప్పన్ వెనుక ఉన్న ఇతర కోణాలను ఆవిష్కరించారు. ఖాకీ దుస్తుల మాటున జరిగిన దాష్టికాలు కూడా ఇందులో ఉన్నాయి.
కంటెంట్ లవర్స్ ని ది హంట్ ఫర్ వీరప్పన్ బాగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ టేకింగ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ ఇది మూవీ కాదు కనక ఉన్నంతలో రియల్ విజువల్స్ తో మెప్పించే ప్రయత్నం చేశారు. తమిళనాడు, కర్ణాటక అడవుల్లో వీరప్పన్ తిరిగిన ప్రాంతాలను చూపించడమే కాదు పగబడితే ఇతను ఎంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకునేవాడో చూపించిన వైనం ఉలిక్కిపడేలా చేస్తుంది. 2008 అక్టోబర్ పోలీసుల ఆపరేషన్ లో హతమైన వీరప్పన్ గురించి వాస్తవిక కోణంలో నిజాలు తెలుసుకోవాలంటే ఇది చూడొచ్చు. అందుకే రెండు రోజులకే ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
This post was last modified on August 7, 2023 3:47 pm
శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు.…
ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…
ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని…
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…
అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకున్న ఎల్2 ఎంపురాన్ కంటెంట్ గురించి అభ్యంతరాలు తలెత్తి దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) - సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య తాజా వివాదం తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. ఉచిత…