ఇద్దరు వారసులు ఇండస్ట్రీలో స్టార్స్ గా అప్ కమింగ్ స్టేజిలో ఉన్నప్పుడు తండ్రిగా నాగార్జునకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. కాకపోతే ఈ మధ్య టైం కలిసిరాక వరుస ఫ్లాపులు అక్కినేని ఫ్యామిలినే కాదు అభిమానులను కూడా బాగా ఇబ్బంది పెట్టాయి. సరైన కంబ్యాక్ కోసం ముగ్గురు ఎదురు చూస్తున్నారు. నాగ చైతన్య తండేల్(ప్రచారంలో ఉన్న టైటిల్)కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. నాగ్ రచయిత ప్రసన్నకుమార్ తో అనుకున్న ప్రాజెక్టుని రీమేక్ ప్లస్ స్క్రిప్ట్ గొడవల వల్ల పెండింగ్ పెట్టేశారు. ఆరెక్స్ 100 అజయ్ భూపతితో సినిమా ఓకే చేశారనే టాక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు.
నిన్న బిగ్ బాస్ సుహైల్ హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వెళ్లిన నాగార్జున ఓ ఆసక్తికరమైన ముచ్చట పంచుకున్నారు. బిడ్డ పుట్టడం అనేది తల్లికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అంతకన్నా బాధ్యత భర్తగా, తండ్రి వహించాల్సి ఉంటుందని చెప్పారు. హలో బ్రదర్ షూటింగ్ పూర్తయ్యాక అఖిల్ కోసం ఆరు నెలలు పూర్తిగా ఇంటి పట్టునే అమలకు తోడు ఉన్నానని, ఆ సమయంలో తాను పక్కన ఉండటం ఎంతో అవసరమని గుర్తించి ఆ మాత్రం త్యాగం చేయడం సబబేనని సెట్లకు దూరం కావాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
మాములుగా రెండు మూడు వారాలు లీవ్ పెట్టుకోవడమే గొప్పగా ఫీలయ్యే వాళ్లకు నాగ్ ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అఖిల్ పెద్దోడయ్యాడు. హీరోగా అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏజెంట్ దారుణంగా డిజాస్టర్ కావడం ఊహించని షాక్ ఇచ్చింది. అందుకే కొత్త సినిమాకు తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తూ సబ్జెక్టుని ఒకటికి పదిసార్లు రివ్యూ చేసుకునే పనిలో ఉన్నాడని టాక్. మిస్టర్ ప్రెగ్నెంట్ టైటిల్ కు తగ్గట్టు మగాడు గర్భం దాలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద రూపొందింది. బిగ్ బాస్ షో నుంచి సొహైల్ తో ఉన్న బాండింగ్ వల్లే నాగ్ గెస్టుగా వచ్చారు.
This post was last modified on August 6, 2023 1:51 pm
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…