ఈ వారం బాక్సాఫీస్ చాలా డల్లుగా ఉంది. కొత్తగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. అయిన వాటిని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత వారంలో వచ్చిన ‘బ్రో’, అంతకంటే ముందు రిలీజైన ‘బేబి’ చిత్రాలే ఉన్నంతలో బాక్సాఫీస్‌ను ఉపయోగించుకున్నాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూసేవాళ్లందరి చూపూ వచ్చే వారం రిలీజయ్యే రెండు సినిమాల మీదే ఉంది.
అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ కాగా.. మరొకటి సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘జైలర్’. మామూలుగా రిలీజ్ వీక్‌లో సోమవారానికి కానీ కొత్త చిత్రాల బుకింగ్స్ ఓపెన్ కావు. కానీ ఇండిపెండెన్స్ డే వీకెండ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ‘భోళా శంకర్’, ‘జైలర్’ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్‌ను రిలీజ్‌కు వారం ముందే ఓపెన్ చేసేశారు. పెద్ద సంఖ్యలో థియేటర్లు బుకింగ్స్ మొదలుపెట్టాయి.
చిరంజీవి చివరి సినిమా ‘వాల్తేరు వీరయ్య’తో పోలిస్తే ‘భోళా శంకర్’ అడ్వాన్స్ బుకింగ్స్ అంత ఆశాజనకంగా లేవు. ఈ సినిమా మీద అంచనాలు ముందు నుంచి తక్కువగానే ఉన్నాయి. రీమేక్ మూవీ కావడం, దారుణమైన ట్రాక్ రికార్డున్న మెహర్ రమేష్ డైరెక్ట్ చేయడం.. టీజర్, ట్రైలర్ ఏమంత ఎగ్జైటింగ్‌గా లేకపోవడం ‘భోళా శంకర్’కు ప్రతికూలం అయ్యాయి. అందుకే బుకింగ్స్ కొంచెం స్లోగా నడుస్తున్నాయి. అలా అని చిరు ప్రభావాన్ని తక్కువగా కూడా చూడలేం. ఇలాంటి సినిమాతో కూడా ఆయన తొలి రోజు పెద్ద ఎత్తున హౌస్ ఫుల్స్ పెట్టబోతున్నాడన్నది స్పష్టం.
ఉదయం 7 గంటల నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘భోళా శంకర్’ షోలు పడబోతున్నాయి. సినిమాకు టికెట్ల ధరలేమీ పెంచలేదు. నార్మల్ రేట్లతోనే సినిమా ఓ మోస్తరు బుకింగ్స్‌తో నడుస్తోంది. ‘భోళా శంకర్’ కంటే ఒక రోజు ముందు, గురువారం రిలీజ్ కానున్న రజినీ సినిమా ‘జైలర్’కు తొలి రోజు పెద్ద సంఖ్యలోనే థియేటర్లిచ్చారు. ఈ సినిమాకు కూడా ఉదయం 7.30 నుంచే షోలు మొదలవుతున్నాయి. రజినీ గత సినిమాలతో పోలిస్తే దీనికి అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు కనిపిస్తోంది. ‘భోళా శంకర్’కు దీటుగా థియేటర్లు ఫుల్ అయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on August 6, 2023 1:45 pm
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…
ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా…
తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు ఏ పత్రికను చూసినా… ఏ ఛానెల్ ను చూసినా…వాటి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు…
నిన్న డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ బాగా ఎమోషనల్ అయిపోతూ సినిమాను చంపొద్దంటూ, సోషల్ మీడియాలో మరీ…
ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో కీలక విభాగం అయిన సీఐడీకి చీఫ్…