మెగా ఫ్యామిలీలో నాగబాబు ఎలా ఉంటారు? ఆయన మాటలు ఎలా ఉంటాయి? లాంటి ప్రశ్నలకు ప్రత్యేకంగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆవేశంగా మాట్లాడటం ఎంతలానో.. అంతే హ్యుమర్ పండించేలా మాట్లాడటంలోనూ దిట్ట.
భావోద్వేగాన్ని దాచుకోకుండా ఓపెన్ అయ్యే ఆయన..రియల్ జీవితంలో కూతురంటే ప్రాణం ఆయనకు. అలాంటి నాగబాబు తాజాగా ఒక కార్యక్రమంలో ఎమోషనల్ గా బరస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఒక ప్రైవేటు చానల్ లో ఆగస్టు 23న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ లో నాగబాబు మాటలు హార్ట్ టచ్చింగ్ గా ఉండటమే కాదు.. చివర్లో తన కుమార్తె నిహారిక అంటే తనకెంత ఇష్టమన్న విషయాన్ని చెప్పిన తీరు అందరిని ఆకట్టుకోవటం ఖాయం. నాగబాబు మాటల్ని వినే ప్రతి అమ్మాయి.. ఫాదర్ అంటే ఇలా ఉండాలన్నట్లుగా ఫీలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన కుమార్తె కడుపులోనే చనిపోయిందన్న విషయాన్ని చెప్పిన ఎమోషనల్ అయిన వేళ.. నాగబాబు ఓపెన్ అయ్యారు.
నిహారిక చిన్నతనంలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ప్రస్తావించారు. ‘ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాం. వాడెవడో నాలాగా నల్లకోటు వేసుకున్నాడని వాడినే నాన్న అనుకొని వెళ్లిపోయింది నిహారిక. దాదాపు ఇరవై నిమిషాల పాటు కనిపించకుండా పోయింది. దీంతో.. పిచ్చెక్కిపోయింది. నాకు ఎలా అనిపించిందంటే.. మొత్తం న్యూజిలాండ్ లో ఉన్న వాళ్లందరిని చంపేద్దామనుకున్నా. వరుణ్ ను ఇంటికి పంపేసి.. నేను..పద్మ సూసైడ్ చేసుకుందామనుకున్నాం. నా కూతురు లేకపోతే.. బతికి ఉన్నా వేస్ట్ అన్నంత పిచ్చ వచ్చేసింది’’ అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యారు. అయిన భావోద్వేగానికి గురైన తీరు ఆకర్షించటమే కాదు.. ఈ ఎపిసోడ్ మీద మరిన్ని అంచనాల్ని పెంచేలా ఉందని చెప్పక తప్పదు.
This post was last modified on August 18, 2020 11:34 am
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…