Movie News

పంచుల సునామీకి ఉస్తాద్ దర్శకుడి హామీ

బ్రో సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదనే సంగతి పక్కనపెడితే రాజకీయ పరంగా మాత్రం పెను దుమారమే రేపింది. తనను ఉద్దేశించే శ్యామ్ బాబు పాత్రను పెట్టి డాన్స్ చేయించారని మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి  ఫైర్ అవ్వడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. దానికి ప్రతిగా నిర్మాత టిజి విశ్వప్రసాద్ స్వీట్ వార్నింగ్ సైతం అభిమానులకు బాగా వెళ్ళింది. ఒకటి రెండు డైలాగులు, సీన్ కే ఇంత రచ్చ జరిగితే సినిమా మొత్తంలో అవే ఉంటే ఇక జరగబోయే అరాచకం గురించి వేరే చెప్పాలా. ఊహించుకోనవసరం లేదు. నిజంగానే జరగబోతోంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో బోలెడన్ని పొలిటికల్ సెటైర్లు, పంచులు ఉంటాయని గత రెండు రోజులుగా వినిపిస్తూనే ఉంది. దీన్నే ఉటంకిస్తూ మన వెబ్ సైట్ వేసిన ట్వీట్ కి స్వయనా డైరెక్టరే స్పందిస్తూ ఖచ్చితంగా పెడుతున్నాననే హామీ ఇచ్చేలా ఖుషి సినిమాలో పవన్ కాలర్ రుద్దుకునే ఇమేజ్ ఒకటి రీ ట్వీట్ చేస్తూ సమాధానం ఇచ్చారు. ఒకవేళ అలాంటి కంటెంట్ లేకపోతే హరీష్ శంకర్ స్పందించేవారు కాదు. కానీ రెస్పాన్స్ వచ్చిందంటే మాత్రం మాటలతో రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. రీమేక్ అయినా సరే హరీష్ శంకర్ మీద నమ్మకం అలాంటిది. ఇప్పటిదాకా కేవలం కొంత భాగం షూటింగే జరిగినప్పటికీ జనసేన వారాహి యాత్రకు బ్రేక్ దొరగ్గానే ముందుగా దీనికే డేట్లు ఇవ్వాలని పవన్ డిసైడ్ అయినట్టుగా వచ్చిన వార్త అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ పోలీస్ ఎంటర్ టైనర్ కి ఇంకా రెండో కథానాయిక ఎంపిక కావాల్సి ఉంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ నెలలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేయబోతున్నట్టు తెలిసింది. 

This post was last modified on August 5, 2023 5:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago