నిన్న థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. కౌంట్ అయితే ఉంది కానీ దేనిలోనూ క్వాలిటీ ఉన్నట్టు అనిపించకపోవడంతో ఆడియన్స్ వాటి వైపు చూడలేదు. కానీ ఓటిటిలో మాత్రం చెప్పుకోదగ్గ కంటెంట్ వచ్చింది. అందులో ప్రధానంగా ప్రేక్షకుల దృష్టిలో పడిన వెబ్ సిరీస్ దయా. శివతో విలన్ గా పరిచయమై ఆ తర్వాత గులాబీతో హీరోగా మారి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న జెడి చక్రవర్తి చాలా గ్యాప్ తర్వాత ఒక ఫుల్ లెన్త్ రోల్ లో దర్శనమిచ్చింది దయాతోనే. ట్రైలర్ కట్ వచ్చాక అంచనాలు అమాంతం మారిపోయాయి. ఇంతకీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో సింపుల్ గా చూసేద్దాం
పోర్టు ఏరియాలో ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ గా పని చేసే దయా(జెడి చక్రవర్తి)కి మెషీన్ పెట్టుకుంటే కానీ వినిపించదు. భార్య(ఈషా రెబ్బా) గర్భవతి. ఓ రోజు లోడు కోసం పట్టణం వెళ్లిన దయాకు బండ్లో జర్నలిస్టు కవిత(రమ్య)శవం కనిపిస్తుంది. దాన్ని మాయం చేసేందుకు నానా తంతాడు పడతాడు. కవిత భర్త(కమల్ కామరాజు)తో పాటు స్థానిక ఎమ్మెల్యే(పృథ్విరాజ్)లకు ఈ కేసుతో సంబంధం ఉంటుంది. అసలు మంచోడైన దయా చుట్టూ ఈ పద్మవ్యూహం ఎవరు పన్నారు, అతని ఉచ్చులో నుంచి ఎలా బయట పడ్డాడు, అసలు హంతకుడు ఎవరు తదితర ప్రశ్నలకు సమాధానం స్మార్ట్ స్క్రీన్ మీదే చూడాలి.
పాతిక నిమిషాల చొప్పున మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్న దయాని దర్శకుడు పవన్ సాధినేని సాధ్యమైనంత మేరకు ఒరిజినల్ వెర్షన్ (తక్దీర్) లో సోల్ ని తగ్గించకుండా ఆసక్తిగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. మధ్యలో కొంత సాగతీత, నెమ్మదిగా ప్రారంభం కావడం లాంటి లోపాలున్నా మరీ బోర్ కొట్టకుండా దయా సాగింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంటెన్స్ గా ఉంది. జెడితో సహా ఆర్టిస్టులు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇటీవలే వచ్చిన స్ట్రెయిట్ తెలుగు సిరీస్ లలో చూసుకుంటే దయానే బాగానే ఎంగేజ్ చేయించిందని చెప్పొచ్చు. నెమ్మదిగా ఉన్నా స్థిరంగా సాగిన కథనం దయాని నిలబెట్టింది.
This post was last modified on August 5, 2023 3:46 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…