90ల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగానే పాపులర్ అయిన తమిళ అమ్మాయి కస్తూరి. కథానాయికగా కెరీర్ ముగిశాక పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ ఆమె.. సోషల్ యాక్టివిస్టుగా మారింది. ఈ మధ్య మళ్లీ సినిమాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. తాజాగా కస్తూరి ఆలీ నిర్వహించే ఓ టీవీ షోకు ముఖ్య అతిథిగా హాజరైంది. దీనికి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అందులో కొన్ని అంశాలపై కస్తూరి చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా ఉండటంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మీరు రాత్రి పడుకునే ముందు ముగ్గురు మగాళ్లకు ఫోన్ చేస్తే.. అంటూ ఆలీ ఏదో అడుగుతుండగానే కల్పించుకున్న కస్తూరి.. దీన్ని ఇలా కాదు.. ‘‘నా మంచం మీద ఎప్పుడూ ముగ్గురు మగాళ్లు ఉంటారు’’ అనొచ్చు అని కామెంట్ చేసింది. అక్కడితో ఆ అంశాన్ని కట్ చేశారు. మరోవైపు అక్కినేని నాగార్జునతో ‘అన్నమయ్య’ సినిమాలో నటించడం గురించి ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎందరో హీరోలతో నటించానని, కానీ తనకున్న ఏకైక క్రష్ నాగార్జున మాత్రమే అని చెప్పింది.
‘అన్నమయ్య’ షూటింగ్ కోసం వెళ్లినపుడు నాగ్ షేక్ హ్యాండ్ ఇచ్చాక ఆ చేతిని కడగకుండా అలాగే చూసుకుంటూ పడుకున్నానని కస్తూరి వెల్లడించింది. మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు కదా.. ఎవరైనా యంగ్ హీరోకు తల్లిగా నటిస్తారా అని అడిగితే.. ఆ హీరో ద్విపాత్రాభినయం చేసి తండ్రీ కొడుకులుగా నటించేట్లయితే తండ్రికి భార్యగా, కొడుక్కి తల్లిగా నటించడానికి సిద్ధమని అంది కస్తూరి. విజయ్ దేవరకొండతో ఇలా చేస్తారా అని అడిగితే మాత్రం ఛాన్సే లేదని.. అతనంటే తనకు చాలా ఇష్టమని ఆమె అంది.
This post was last modified on August 18, 2020 1:23 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…