మాచిరాజు గోవిందరావు…. ‘శివ’ సినిమా డబ్బింగ్ జరుగుతుంది.. అంతకుముందు నేను కో డైరెక్టర్ గా పని చేసిన అన్ని సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పించేవాడిని..తరువాత ఆ డైరెక్టర్ ఒక సారి చూసుకుని తనకి కావాల్సిన మార్పులు ఉంటే చెప్పేవారు..కానీ శివ సినిమా కి రాము(rgv) తనే ఉండి డబ్బింగ్ చెప్పిస్తానన్నాడు..మొదటి సినిమా కాబట్టి ఆ ఉత్సాహాం ఉంటుంది..అది సహజం..డబ్బింగ్ మొదలైంది..
చిన్న చిన్న వేషాలకు డబ్బింగ్ ఆర్టిస్టులు చెబుతున్నారు..మాధ్యాహ్నమ్ వరకు బాగానే జరిగింది..ఈవెనింగ్ నేను.. తేజ పబ్లిసిటీ ఈశ్వర్ గారి దగ్గరకు వెళ్లి ఒక గంటలో మరల థియేటర్ కి వచ్చాము..ఈ లోగా రాము ఒక సీన్ లో డైలాగ్ ఒక ఆర్టిస్ట్ తో చెప్పించాడు..నేను ‘వద్దు .ఈ క్యారెక్టర్ ఇంకా తర్వాత రెండు సీన్స్ లో వస్తుంది..ఆ సీన్లు కూడా ఇతనే చెప్పాల్సివుంటుంది.. డబ్బింగ్ లో ఇతనికి అంత సీన్ లేదు…
చేప్పడంలో చాలా పూర్..వేరేవారితో చెప్పిద్దాం’ అన్నా..రాము అతని వాయిస్ చాలా బాగుంది..ఈ క్యారక్టర్ కి ఇదే బెటర్ వాయిస్ అన్నాడు’..’మీ అభిప్రాయం కరక్టే..కానీ ఇతనికి బ్రెయిన్ తక్కువ ..అందుకని ఓన్లీ బిట్స్..గ్రూపు లో జనాలకి మాత్రమే వాడతాం’ అన్నా..
అప్పుడు రాము ఒక మాట అన్నారు..”మీ కో డైరెక్టర్స్ అంతా కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయాలతో పని చేస్తుంటారు..కొత్తగా ప్రయత్నిద్దాం అనుకోరు’ అని..నాగేశ్వరరావు ఇగో దెబ్బ తినలేదుగాని అతనిలో ఉన్న కో డైరెక్టర్ ఇగో దారుణంగా దెబ్బతిన్నది..’సరే ఒకే ..ఇతతోననేతోనే చెప్పిద్దాం’ అన్నాను….అన్నాను గాని నాకు మనసు ప్రశాంతంగా లేదు..కారణాలు రెండు..ఒకటి కో డైరెక్టర్ ఇగో దెబ్బ తినడం..రెండు ఈ ఆర్టిస్ట్ తో ఇంకో రెండు సీన్స్ ఎలా చెప్పించాలి..సరే..కరక్ట్ గా ఈవినింగ్ 5 గంటలకు అదే ఆర్టిస్ట్ చెప్పాల్సిన ఇంకో డైలాగ్ వచ్చింది..చిన్న డైలాగ్..ఎవరు చేశారు అనే ప్రశ్నకి బదులుగా “మాచిరాజుగోవిందరావ్” అని చెప్పాలి అతను అదే మాటని రెండు పేర్లుగా పలుకుతున్నాడు..మాచిరాజు.. . గోవిందరావు అని..రాము ఇంజనీర్ రూమ్ లోనుంచి చెబుతున్నాడు..మధ్యలో గ్యాప్ లేకుండా చెప్పాలి అని.
You should not give gap inbetiveen..అని….’ఒకే సార్’ అని మరల అలాగే చెబుతున్నాడు..రాము కి కోపం వస్తుంది నెమ్మదిగా..నాలో ఉన్న కో డైరెక్టర్ ఇగో నెమ్మదిగా శాంతించడం మొదలైంది…..చివరికి రాము కోపంతో ‘షిట్’అని అరిచాడు..’చెబితే అర్ధం కాదా’ అని వాడి మీద కోపంగా అరిచాడు….కో డైరెక్టర్ ఇగో పూర్తిగా శాంతించింది..అప్పుడు రాముతో..ఒక పదిహేను నిమిషాలు వేరేవాళ్ళతో చెప్పిస్తూవుండండి..నేను ఇప్పుడే వస్తాను అని అతనిని తీసుకుని థియేటర్ మీద వున్న టెర్రస్ మీదకు వెళ్ళా..
వాల్మీకి స్ట్రీట్ లో ఉన్న సురేష్ డబ్బింగ్ థియేటర్ ఆది….ప్రొడక్షన్ బాయ్ కి రెండు టీ పైకి పంపమని చెప్పి..ఇద్దరం పైన కూర్చున్నాం..టీ వచ్చింది.. టీ తాగి.. సిగటర్ తీసి వెలిగించుకుని.. అతనికి ఆఫర్ చేశా..వొద్దన్నాడు..నాకు తెలుసు నువ్వు కాలుస్తావని …పర్వాలేదు కాల్చు అని ఇచ్చాను..ఇద్దరం సిగరెట్స్ కాలుస్తూవుండగా చాలా క్యాజువల్ విషయాలు మాట్లాడాక అతను పూర్తిగా నేను తన మనిషిని అనే భరోసా కల్పించి..ఇప్ప్పుడు నేను కొన్ని పేర్లు చెబుతాను..యధాతధంగా చెబుతావా అంటే అలాగే సార్ అన్నాడు..మొదలు పెట్టా..అక్కినేనినాగేశ్వరరావు..అతను చెప్పాడు.అక్కినేనినాగేశ్వరరావు. నందమూరి తారకరామారావు..నందమురుతారకరామారావు.. చెప్పాడు..మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి..చెప్పాడు..ఇలా వరసగా ఏడూ ఎనిమిది పెర్లు చెప్పా.. కరక్టుగా చెప్పాడు..
అప్పుడు మాచరాజుగోవిందరావ్ అన్నా..కరెక్టుగా చెప్పాడు(మాచిరాజుగోవిందరావు అని గ్యాప్ లేకుండా)..ఇప్పుడు రా క్రిందికి వెళదాం అని థియేటర్ లోకి వెళ్లి ‘రెడీ రామూ.. టేక్ అన్నాను..గ్యాప్ లేకుండా ‘మాచిరాజుగోవిందరావ్’ అని పర్ఫెక్ట్ గా చెప్పాడు..రాము..సూపర్..ఫెంటాస్టిక్..ఎలా చెప్పించారు అని అడిగాడు..’ఎదో మా కో డైరెక్టర్స్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి అవి కూడా మీకు చెబితే ఇక మాకు వాల్యూ ఎం ఉంటుంది’ అన్నాను…ప్యాకప్ అయ్యాక పైన జరిగినదంతా చెప్పి’అతని బ్రెయిన్ స్ట్రక్ అయ్యింది..దానిలోంచి అతనిని బయటకు తెచ్చే ప్రయత్నం చేసాను..వర్క్ఔట్ అయ్యింది’..అన్నా..సారీ నాగేశ్వరావ్ ఇందాక నీ మీద కామెంట్ చేసినందుకు అని….సూపర్ ఐడియా….ఫెన్టాస్టిక్ అన్నాడు RGV.. .
— శివ నాగేశ్వర రావు
This post was last modified on August 17, 2020 11:47 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…