బేబి అనే చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర కొన్ని వారాలుగా ఎలా ప్రకంపనలు రేపుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా స్థాయికి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం అన్నది ఊహకైనా అందని విషయం. ఐతే ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడో వారంలోనూ మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ వీకెండ్లో ఆ చిత్రం ‘బ్రో’కు దీటుగా షేర్ రాబట్టబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
‘బేబి’ ఎఫెక్ట్ ఈ స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు, చివరికి ఆ చిత్ర బృందంలోని ముఖ్యులు కూడా. ‘బేబి’ టీం తమ చిత్రాన్ని ప్రమోట్ చేసిన తీరు.. ఒక బెంచ్ మార్క్ లాగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. మరీ ఖర్చు పెట్టకుండానే కేవలం సోషల్ మీడియా ప్రమోషన్‌తోనే సినిమా మీద ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచడంలో చిత్ర బృందం విజయవంతం అయింది.
ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి.. ప్రతిదీ పద్ధతిగా చేశారు. ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాట సినిమాకు సగం ప్రమోషన్ చేసి పెట్టేసింది. మిగతా పాటలు.. టీజర్.. ట్రైలర్.. ఇలా ప్రతిదీ క్లిక్ అయింది. ట్రైలర్ చూశాక జనం సినిమా చూడటానికి ఆగలేకపోయారు. ఆ తర్వాత పెయిడ్ ప్రిమియర్స్‌ను కూడా భలేగా ప్లాన్ చేశారు. రిలీజ్ తర్వాత మెగా ఫ్యామిలీ హీరోలు, పెద్దలను సినిమా కోసం ఉపయోగించుకున్న తీరు కూడా ‘బేబి’ టీం ప్లానింగ్‌కు నిదర్శనం. ముందు ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ అతిథిగా ఒక ఈవెంట్ చేశారు.
ఆ తర్వాత రెండో వారంలో అల్లు అర్జున్‌తో, మూడో వారంలో చిరంజీవిలతో ఈవెంట్లు చేశారు. ఇది కాక అల్లు అరవింద్ పార్టీ ద్వారా కూడా సినిమాను ప్రమోట్ చేశారు. వీటికి తోడు ప్రమోషనల్ టూర్స్ కూడా సమయానుకూలంగా చేశారు. సినిమాలోని కంటెంట్‌కు తోడు ఈ ప్రమోషన్లు కూడా ప్లస్ అయ్యాయి. మరీ ఖర్చు పెట్టకుండానే ఒక పెద్ద సినిమాను మించి ‘బేబి’ని ప్రమోట్ చేసిన తీరును చూసి మిగతా ఫిలిం మేకర్స్ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.
This post was last modified on August 4, 2023 3:29 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…