చిన్న సినిమాగా రిలీజై నెల రోజులు దాటకుండానే ఎనభై కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించిన బేబీ జైత్రయాత్ర ఇంకా కొనసాగుతోంది. వసూళ్లు డ్రాప్ అయ్యాయి కానీ చాలా చోట్ల స్టడీగా ఉన్న మాట వాస్తవం. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం టీమ్ ప్రత్యేకంగా సక్సెస్ టూర్ మొదలుపెట్టింది. ఆంధ్రా వైపు ప్రాంతాల్లో విజయ యాత్ర కొనసాగిస్తోంది. వంద కోట్ల టార్గెట్ ను అందుకోవాలని చూస్తోంది. దానికి ఏడు రోజులు కీలకం కాబోతున్నాయి. జైలర్, భోళా శంకర్ వచ్చాక ఆటోమేటిక్ గా కలెక్షన్లు తగ్గిపోతాయి కాబట్టి ఆలోగానే అందుకోవాలి.
వీటి సంగతలా ఉండగా బేబీ అన్ కట్ వెర్షన్ ని ఓటిటి రిలీజ్ కోసం రెడీ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. సుమారు నాలుగు గంటలకు పైగా లెన్త్ ఉన్న డైరెక్టర్ కట్ ని ఆహాలో స్ట్రీమింగ్ చేసే ఆలోచన ఉందట. అయితే థియేటర్ లో చూడని ఆడియన్స్ ఇంత సుదీర్ఘమైన నిడివిని తట్టుకుంటారా లేదా అనే దాని మీద ఒక కంక్లూజన్ కు రాలేకపోతున్నారని తెలిసింది. ఒకవేళ రెండూ పెడితే వ్యూస్ విడిపోతాయి కాబట్టి రెవిన్యూ పరంగా ఇబ్బందవుతుంది. లేదూ కొంత కాలం ఆగి తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సాయిరాజేష్ నేరుగా కాకపోయినా చూచాయగా క్లూస్ ఇస్తున్నారు.
గతంలో అర్జున్ రెడ్డి విషయంలోనూ ఇలాంటి టాకే వినిపించింది. సందీప్ రెడ్డి వంగా ఎడిటింగ్ టేబుల్ లో తీయించిన గంట ఫుటేజ్ ని తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఒకటి రెండు సీన్లు మినహాయించి వదల్లేదు. దీంతో రౌడీ ఫ్యాన్స్ నిరాశపడినా వాళ్ళ కోరిక అలాగే మిగిలిపోయింది. కానీ బేబీ విషయంలో అలా జరగకూడదని మూవీ లవర్స్ కోరిక. ఆగస్ట్ 18 ఓటిటిలో రావొచ్చనే టాక్ ఉంది కానీ నిర్మాత ఎస్కెఎన్ మాత్రం ఇంకా డేట్ డిసైడ్ కాలేదంటున్నారు. థియేటర్లో చూడని బేబీ కంటెంట్ లో విరాజ్ అశ్విన్, ఆనంద్ తల్లి సీన్లతో పాటు మరో రెండు పాటలు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.
This post was last modified on August 4, 2023 11:40 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…