Movie News

సోనూ సూద్ సూర్యుడు, నేను మిణుగురు పురుగు:బ్రహ్మి

హఠాత్తుగా విధించిన లాక్ డౌన్ వల్ల వలస కూలీలు, కార్మికుల జీవితాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడంలో బాలీవుడ్ విలన్ సోనూసూద్ తో పాటు పలువురు సెలబ్రిటీలు, సినీతారలు, సామాన్యులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సాయం చేశాయి. అయితే, వీరందరిలోకి సోనూసూద్ ఎక్కువమందికి సాయం చేశాడనడంలో ఎటువంటి సందేహంలేదు. ఎందరినో ఆదుకున్న ఈ బాలీవుడ్ విలన్ ఒక్కసారిగా రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు. ఎందరికో సాయం చేసిన సోనూసూద్ పై చాలామంది సెలబ్రిటీలు, పొలిటిషియన్లు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే, తాజాగా సోనూసూద్ పై టాలీవుడ్ లెజెండరీ కమెడియన్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ ఆరిపోయే జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడని, అయితే, తాను కూడా చాలామందికి సాయం చేసినా పబ్లిసిటీ చేసుకోలేదని అన్నారు బ్రహ్మానందం.

సోనూసూద్ కూడా వలస వచ్చినవాడేనని, అందుకే, తన శక్తి కొలదీ వలస ఆదుకున్నారని బ్రహ్మి అన్నారు. అయితే, తాను కూడా ఈ మధ్య కాలంలో చాలామందికి సాయం చేశానని, కానీ, ఆ సాయానికి ప్రూఫ్‌లు, ఫొటోలు తీయించుకోలేదని అన్నారు. అదొక్కటే తాను చేసిన తప్పు.. ఒప్పు అని వేదాంత ధోరణిలో మాట్లాడారు బ్రహ్మి. సోనూసూద్ ఒక సూర్యుడు వంటి వాడైతే…తాను మిణుగురు పురుగు లాంటి వాడినని, తన కాంతి తనదేనని అన్నారు. తాను డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటానని కామెంట్స్ చేస్తుంటారని, అది నిజమేనని చెప్పారు బ్రహ్మి. డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకుంటే వేరెవరి సాయం కోసమో ఎదురు చూడాలని, అది దు:ఖానికి హేతువని వేదాంత ధోరణిలో మాట్లాడారు బ్రహ్మి.

తినడానికి తిండి ఉంటే చిన్న గూడు, తిరగడానికి ఒక కారు కొనుక్కోమని తన మిత్రులకు సలహా ఇస్తుంటానని చెప్పుకొచ్చారు. ఓ సీనియర్ కెమెరామెన్ అద్దె కట్టలేదని ఇంటి ఓనర్ సామాన్లు బయటపడేశాడని, ఆయనకు సాయం చేశానని, ఈలోకంలో ఎవడూ ఎవడికి దానం చేయడని అన్నారు బ్రహ్మి.ఏదైనా ఒక టైం వరకే నడుస్తుందని, ఓ దశ దాటితే ఎవరైనా పక్కకు వెళ్లాల్సిందేనని తన సినిమా ఆఫర్లనుద్దేశించి అన్నారు. ఆకలితో ఉన్నప్పుడు భోజనం చేశానని, చాల్లేరా బాబూ అనుకున్నప్పుడు భోజనం చేశానని చెప్పుకొచ్చారు బ్రహ్మి. ఇప్పుడు సరైన ఆహారం దొరికినప్పుడు మాత్రమే భోజనం చేయాలని అనుకుంటున్నానని, తనకు సరైన ఆఫర్లు వస్తే నటిస్తానని అంటున్నారు బ్రహ్మానందం.

This post was last modified on August 17, 2020 10:22 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అర్థం కాలేదంటూనే థియేటర్లకు వెళ్తున్నారు

నిన్న విడుదలైన ఉపేంద్ర యుఐకి విచిత్రమైన టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్, అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత…

13 minutes ago

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

5 hours ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

12 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

13 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

13 hours ago