Movie News

అంబటికి ‘బ్రో’ నిర్మాత మాస్ వార్నింగ్

‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పేరుతో తనను పోలిన క్యారెక్టర్ పెట్టి స్పూఫ్ చేయడంపై వైకాపా సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ఎంత గొడవ చేస్తున్నారో తెలిసిందే. ముందు ఈ విషయమై కొంచెం సరదాగానే స్పందించిన అంబటి.. ఆ తర్వాాత చాలా సీరియస్ అయిపోయారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘బ్రో’ సినిమా అట్టర్ ఫ్లాప్ అని.. డిజాస్టర్ అని స్టేట్మెంట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

అంతే కాక ఈ సినిమాకు సంబంధించిన పెట్టుబడుల మీద.. అలాగే పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన రెమ్యూనరేషన్ మీద కూడా అంబటి తీవ్ర ఆరోపణలతో ఈడీ అధికారులను కలవడానికి ఢిల్లీ వెళ్తుండటం మీద చర్చ జరుగుతోంది. అంతటితో ఆగకుండా త్రివిక్రమ్ సహా ఇండస్ట్రీ జనాలకు అంబటి చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఐతే మంత్రి స్థానంలో ఉండి అంబటి ఇలా వార్నింగ్ ఇవ్వడమేంటి అనే చర్చ జరుగుతుండగా.. అంబటికి ‘బ్రో’ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఇచ్చిన మాస్ వార్నింగ్ తాలూకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘బ్రో’ సినిమాకు సంబంధించి అంబటి చేసిన ఆరోపణలు.. ఈ సినిమా రైటర్ త్రివిక్రమ్ సహా ఇండస్ట్రీకి ఇచ్చిన వార్నింగ్ గురించి ఒక ఇంటర్వ్యూలో విశ్వప్రసాద్‌ను అడగ్గా.. వీటిని తాను ఆరోపణలుగా భావించడం లేదని అన్నారు. వాటిని గాలి మాటలుగానే పరిగణించి లైట్ తీసుకుంటున్నానంటూ నవ్వేశారు. అలా కాకుండా తాను సీరియస్‌గా తీసుకుంటే మాత్రం కథ వేరుగా ఉంటుందని.. తనకు చాలా బలమైన లీగల్ టీం ఉందని.. ఆ మార్గంలో వెళ్తే అంబటిని కిందికి దించగలను (I’ll take him down) అని విశ్వప్రసాద్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

కూల్‌గా మాట్లాడుతూనే అంబటికి మాస్ వార్నింగ్ ఇచ్చారంటూ విశ్వప్రసాద్‌పై పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో ఇంటర్వ్యూలో ‘బ్రో’ పెట్టుబడులు.. పవన్ రెమ్యూనరేషన్ గురించి అడిగితే.. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఒక న్యూస్ ఛానెల్ ప్రెజెంటర్‌కు విశ్వ ప్రసాద్ ఇచ్చిన కౌంటర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.

This post was last modified on August 3, 2023 11:08 am

Share

Recent Posts

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

3 minutes ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

2 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

3 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

3 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

3 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

4 hours ago