అనువాద చిత్రాలను తెలుగు వాళ్లు ఆదరించినట్లు దేశంలో ఇంకెవరూ ఆదరించరు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలో విషయం ఉందంటే మూలం ఏ భాష అని చూడరు. కాబట్టే కొన్ని దశాబ్దాలుగా తమిళ అనువాదాలు తెలుగులో గొప్పగా ఆడుతున్నాయి. తెలుగులో బాగా ఆడిన హిందీ చిత్రాలు కూడా చాలా ఉన్నాయి. గత కొన్నేళ్లలో కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతార లాంటి కన్నడ సినిమాలకు సైతం బ్రహ్మరథం పట్టారు మన ఆడియన్స్.
ఐతే పరభాషా చిత్రాలను ఇంతగా ఆదరిస్తున్నపుడు.. వాటి డబ్బింగ్ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చాలామందికి ఈ విషయం పట్టదు. సింగం, వలిమై లాంటి తమిళ టైటిళ్లు పెట్టి తెలుగులో సినిమాలు రిలీజ్ చేయడం అంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఇది తెలుగు ప్రేక్షకులను గ్రాంటెడ్‌గా తీసుకోవడం కాక మరేంటి? ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ఒక టైటిల్ చూస్తే మరింత షాక్ అవ్వాల్సిందే.
ఊల్ఫ్ (Wolf) … ప్రభుదేవా నటిస్తున్న కొత్త చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేశారు. తెలుగులో కూడా ప్రభుదేవాకు మంచి గుర్తింపే ఉంది కాబట్టి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. సినిమాను అనౌన్స్ చేసిన సందర్భంగా ఆయా భాషల్లో ప్రత్యేకంగా పోస్టర్లు కూడా వదిలారు. ఐతే తెలుగు వెర్షన్ పోస్టర్లో ఉన్న పేరు ఏంటో తెలుసా.. ‘ఉల్ఫ’. ఇదే పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారంటే ఇంతకంటే నిర్లక్ష్యం ఏముంటుంది?
కనీసం తెలుగులో పోస్టర్ వదులుతున్నపుడు ఇక్కడి పీఆర్వోలనో, మరొకరినో ఒక్క మాట అడిగి టైటిల్ కరెక్టుగా రాయించుకోలేరా అన్నది ప్రశ్న. కనీసం సరైన టైటిల్ కూడా పెట్టలేని వాళ్లకు ఇక్కడి ప్రేక్షకుల ఆదరణ కావాలా? వసూళ్ల మోత మోగిపోవాలా? ఇలాంటి వాళ్లకు తెలుగులో సినిమాను రిలీజ్ చేసే అర్హత ఉందా? అని తెలుగు నెటిజన్లు మండిపడుతున్నారు. మరి గురువారం రిలీజయ్యే టీజర్లో కూడా టైటిల్‌ను ఇలాగే చూపిస్తారా? ఏమైనా కరెక్షన్ చేస్తారా అని చూడాలి.
This post was last modified on August 2, 2023 3:30 pm
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…