హీరో ఎవరైనా ప్రతి సినిమాకు కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. అవి పాజిటివ్ కావొచ్చు లేదా నెగటివ్ అవ్వొచ్చు. వాటికి రివర్స్ లో ఫలితాలు రావొచ్చు. ఖచ్చితంగా ముందే చెప్పలేం. భోళా శంకర్ మీద షూటింగ్ స్టేజి నుంచి ఫ్యాన్స్ లోనే ఒకరకమైన ప్రతికూల ఫీలింగ్ ఉంది. పైగా పవన్ కళ్యాణ్ బ్రో దెబ్బ తినడంతో కేవలం రెండు వారాల గ్యాప్ తో అన్నయ్య చిరంజీవి మరో రీమేక్ తో రావడం ఎంతలేదన్నా ఇబ్బంది కలిగిస్తుంది . కానీ బయ్యర్లు, నిర్మాత దీని మీద చూపిస్తున్న ఆసక్తి వేరుగా ఉంది. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సక్సెస్ ని దృష్టిలో పెట్టుకుని రేట్ల గురించి పెద్దగా ఆలోచించడం లేదు.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు భోళా శంకర్ 90 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసింది. సైరా లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ తో పోల్చుకుంటే ఇది తక్కువే. అయినప్పటికీ వేదాళం రీమేక్, మెహర్ రమేష్ దారుణమైన ట్రాక్ రికార్డు, అంతగా కిక్ ఇవ్వని మహతి స్వరసాగర్ పాటలు వెరసి ఇన్ని నెగటివ్ పాయింట్స్ మధ్య ఈ ఫిగర్స్ తో లెక్కలు కట్టడం విశేషమే. సీడెడ్ 13 కోట్లు, ఆంధ్ర 37 కోట్లు, నైజామ్ 25 కోట్ల దాకా అమ్ముడుపోయాయట. ఓవర్సీస్ మరో 15 కోట్లు అదనం. అయితే బ్రేక్ ఈవెన్ రావాలంటే భోళా శంకర్ ఖచ్చితంగా వంద కోట్ల షేర్ దాటాల్సి ఉంటుంది.
నిర్మాత అనిల్ సుంకర తో సహా టీమ్ మొత్తం ఫలితం మీద కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ ఆదివారం 6వ తేదీ హైదరాబాద్ శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అఫీషియల్ నోట్ రాలేదు. ఆచార్య, గాడ్ ఫాదర్ లకు విపరీతంగా ప్రమోషన్లు చేసిన చిరంజీవి వాల్తేరు వీరయ్యకు కొంత తగ్గించి రిజల్ట్ వచ్చాక స్పీడ్ పెంచారు. భోళా శంకర్ కోసం ఇంకా రంగంలోకి దిగలేదు. కీర్తి సురేష్ డేట్లు ఇస్తే తనతో కొన్ని ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తారు. తమన్నా, సుశాంత్ అందుబాటులో ఉండి ఒక ముఖాముఖీ పూర్తి చేశారు. మరి కొండంత ఉన్న లక్ష్యాన్ని భోళా గోరంతగా మారుస్తాడా చూడాలి.
This post was last modified on August 2, 2023 3:26 pm
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల…