బన్నీ అభిమానులే కాదు ప్రత్యేకంగా ఒక సినిమాకు ఫ్యాన్స్ ఉండటం అనేది బాహుబలి, కెజిఎఫ్ తర్వాత పుష్ప 2కే జరిగింది. ఇప్పటిదాకా ఓ నలభై శాతం షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు సుకుమార్ ఇకపై వేగం పెంచబోతున్నాడు. ఒక కన్సర్ట్ కోసం వెళ్లి బెల్జియం ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చిన అల్లు అర్జున్ ఇకపై నాన్ స్టాప్ గా డేట్లు ఇవ్వబోతున్నాడు. వచ్చే వారం నుంచే కొత్త షెడ్యూల్ ఉండొచ్చు. సుకుమార్ కు వచ్చిన అతి పెద్ద సమస్య ఆర్టిస్టుల కాల్ షీట్లను సమన్వయం చేసుకోవడం. అందరూ బిజీ ఆర్టిస్టులే కావడంతో కాంబినేషన్ సీన్లు పెద్ద ఇబ్బందిగా మారాయి.
ఇదిలా ఉండగా విడుదల తేదీ విషయంలో పుష్ప 2 ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2024 సంక్రాంతి ఛాన్స్ లేదు కాబట్టి వేసవిని టార్గెట్ చేయాలి. అయితే బన్నీ సుకుమార్ ఇద్దరూ ఏప్రిల్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు వినికిడి. జూనియర్ ఎన్టీఆర్ దేవర ఆ నెల 5న వస్తుంది కాబట్టి దాంతో క్లాష్ అవ్వకుండా, థియేటర్ల సమస్య రాకుండా రెండు లేదా మూడో వారంకి లాక్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ లోపు షూటింగ్ పూర్తి చేస్తే ఆపై రెండు మూడు నెలలు ప్రమోషన్లకు వాడుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ తరహాలో దేశమంతా పబ్లిసిటీని ప్లాన్ చేసేలా బన్నీ టీమ్ పక్కా ప్లాన్ సిద్ధం చేసిందట.
ఎలాగూ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇంకా లేట్ అయ్యేలా ఉంది కాబట్టి పుష్ప 2ని వీలైనంత త్వరగా తీసుకురావడం మంచి ఎత్తుగడ. ఇండియా, కేరళకే పరిమితమైన తన మార్కెట్ ని మరిన్ని దేశాల్లో విస్తృతం చేసేలా బన్నీ చాలా స్ట్రాటజీలను సిద్ధం చేయిస్తున్నాడు. త్రివిక్రమ్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీకి చాలా టైం పడుతుంది కాబట్టి ఆలోగా పుష్ప 2 కనక వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే బ్రాండ్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. బావా అంటూ చనువుగా పిలిచే తారక్ తో క్లాష్ అవ్వకుండా బన్నీ తన పుష్ప 2కి ఎలాంటి డేట్ సెట్ చేసుకుంటాడో చూడాలి.
This post was last modified on August 2, 2023 12:26 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…