సరిగ్గా ఇంకో తొమ్మిది రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ విడుదల కాబోతోంది. చెన్నైలో మూడు రోజుల క్రితం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఇప్పటిదాకా ట్రైలర్ ఊసే లేదు. టీజర్ తో సరిపెట్టారు. అంతో ఇంతో హైప్ వచ్చిందంటే అది కేవలం తమన్నా స్టెప్పులు అదరగొట్టిన కావాలయ్యా యాయా పాట మహాత్యమే. తమిళంలో ఎలాగూ ఆయన రేంజ్ కి ఓపెనింగ్స్ కి టెన్షన్ లేదు కానీ తెలుగు వెర్షన్ నిర్మాతలు ఇంకా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. గతంలో పెద్దన్నకు సైతం అనారోగ్యం కారణంగా తలైవా ప్రత్యక్ష హాజరులో ఎలాంటి వేడుక చేయలేకపోయారు.
జైలర్ కు ఆ సమస్య లేదు. రజని బయటికి వచ్చేంత హెల్తీగానే ఉన్నారు. మరి హైదరాబాద్ లో ఓ ఈవెంట్ చేస్తే బాగుటుందని ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి భోళా శంకర్ ఎంత రీమేక్ అయినప్పటికీ మరీ తక్కువ అంచనా వేస్తే ప్రమాదమని, మాస్ సెంటర్స్ లో బలమైన పోటీ లేకపోతే ఆయన చెలరేగిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు జైలర్ స్పీడ్ పెంచడం చాలా అవసరం. టాలీవుడ్ లో ఎందరో సన్నిహితులు ఉన్నారు. రజని అడగాలే కానీ చీఫ్ గెస్టుగా వచ్చేందుకు ఎవరైనా సరేనంటారు. చేస్తారో లేదోనదే పెద్ద ప్రశ్న.
సన్ పిక్చర్స్ సంస్థ మాత్రం కంటెంట్ పట్ల ధీమా ఉంది. పెద్ద క్యాస్టింగ్, భారీ బడ్జెట్, ఇతర భాషల్లో నుంచి తీసుకున్న స్టార్ హీరోల క్యామియోలు, అనిరుద్ రవిచందర్ సంగీతం ఇవన్నీ చూసుకుని తమ చేతుల్లో బ్లాక్ బస్టర్ ఉందనే కాన్ఫిడెన్స్ చూపిస్తోంది. ముంబైలోనూ తమన్నాతో ప్రెస్ మీట్ చేయించారు కానీ అక్కడికి రజని వెళ్ళలేదు. కానీ ఏపీ, తెలంగాణ మార్కెట్ ని హిందీ కోణంలో చూడలేం. ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా తలైవాకు ఇక్కడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళను సంతృప్తిపరుస్తూనే ఇక్కడి మీడియాతోనో కాస్త మాటలు కలుపుకుంటే హైప్ పెరిగేందుకు దోహదపడుతుంది.
This post was last modified on August 1, 2023 5:56 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…