మాములుగా ఏదైనా స్టార్ హీరో సినిమాలో ఆఫర్ రావడం అంటే అప్ కమింగ్ హీరోయిన్లకు పెద్ద ప్రమోషన్ లాంటిది. మరి ఏకంగా పవన్ కళ్యాణ్ మూవీలో ఛాన్స్ కొట్టేస్తే నిద్ర పడుతుందా. కానీ కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. బ్రోకు ఇంత కలెక్షన్లు వచ్చాయంటే దానికి పని చేసింది పవర్ స్టార్ ఇమేజ్ ఒకటే. త్రివిక్రమ్ మాటలు రెండో స్థానం తీసుకున్నాయి. సాయి ధరమ్ తేజ్ తో సహా ఇంకే అంశం హైలైట్ కాకపోయింది. ఉన్నంతలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు. ఇక మిగిలినవన్నీ లైట్ తీసుకున్నారు.
కన్నుగీటు సుందరిగా యూత్ లో పాపులరైన ప్రియా వారియర్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ ఏవీ పేరు తీసుకురాలేదు. నితిన్ పక్కన చెక్ లో హీరోయిన్ గా చేస్తే దాని డిజాస్టర్ ఫలితం ప్రయోజనం కలిగించలేదు. ఇప్పుడు పవన్ చెల్లెలిగా బ్రోలో నటించినా తన పాత్ర, మేకప్, ఇచ్చిన సీన్లు, భావోద్వేగాలు ఏవీ మళ్ళీ ఇంకో ఆఫర్ ఇద్దామనేలా లేవు. తన కన్నా చిన్న చెల్లిగా చేసిన యువలక్ష్మికి ప్రీ క్లైమాక్స్ నుంచి మంచి ఎమోషనల్ సీన్లు పడ్డాయి. ఇక లక్ష్య, రంగ రంగ వైభవంగాతో సూపర్ ఫ్లాపులు చూసిన కేతిక శర్మకు బ్రో మీద పెట్టుకున్న ఆశలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. స్టార్ హీరో పక్కన జోడిగా నటిస్తే తప్ప బ్రేక్ దొరకడం కష్టం. అదే సినిమాలో ఇంకే పాత్ర చేసినా ఇంకెవరి పక్కన నటించినా అంత గుర్తింపు ఉండదు. గ్లామర్, నటన తదితర లెక్కలన్నీ దీని తర్వాతే. అందుకే కేతిక, ప్రియాలు ఎంత ప్రమోషన్లలో పాల్గొన్నా బ్రో విజయం వల్ల అటువంటి క్యారెక్టర్లే వస్తాయి. పవన్ తొలిప్రేమ టైంలో వాసుకికి ఈ ఇబ్బంది వచ్చింది. ప్రేమిస్తే ఎంత హిట్ అయినా అందరూ సిస్టర్ గా నటించమని అడిగేవారు. దీంతో బ్రేక్ తీసుకుని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. బ్రోలో పవన్ డామినేషన్ కి సాయి తేజే తట్టుకోలేనప్పుడు వీళ్ళెంత.
This post was last modified on July 31, 2023 4:07 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…