సినిమాలకు బాగా అనువైన షార్ట్ సీజన్‌గా సంక్రాంతినే చూస్తారు అందరూ. ఆ తర్వాత వేసవి, దసరా లాంటి సీజన్లలో బాగా రష్ ఉంటుంది. డిసెంబర్లో సైతం చెప్పుకోదగ్గ స్థాయిలోనే పోటీ ఉంటుంది. కానీ ఈ ఏడాది డిసెంబరులో మాత్రం రష్ మామూలుగా ఉండబోవట్లేదు. పెద్దవి, మిడ్ రేంజివి కలిపి పది సినిమాల దాకా డిసెంబరు నెలను టార్గెట్ చేయడం విశేషం. ఆల్రెడీ విక్టరీ వెంకటేష్ 75వ సినిమా ‘సైంధవ్’.. నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘హాయ్ నాన్న’ క్రిస్మస్ వీకెండ్‌ను టార్గెట్ చేశాయి.
వాటి మీద మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యే నితిన్ సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ను సైతం క్రిస్మస్ వీకెండ్‌కు షెడ్యూల్ చేశారు. ఇలా మూడు పేరున్న సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయడం సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతుండగా.. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ని సైతం క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది.
పవన్ డేట్లు సర్దుబాటు చేయడాన్ని బట్టి ‘ఓజీ’ని క్రిస్మస్‌కు రిలీజ్ చేస్తారా అన్నది ఆధారపడి ఉంది. ఆ సినిమా కనుక క్రిస్మస్ వీకెండ్‌కు వచ్చేట్లయితే పై మూడు చిత్రాల్లో రెండు ఔట్ ఆఫ్ రేస్ అవ్వాల్సిందే. మరోవైపు హిందీ సినిమా అయినప్పటికీ ‘యానిమల్’ను డైరెక్ట్ చేస్తోంది సందీప్ రెడ్డి వంగ కావడంతో దాని మీదా తెలుగులో మంచి అంచనాలున్నాయి. ఆ చిత్రం డిసెంబరు 1న రాబోతోంది.
మరోవైపు షారుఖ్ ఖాన్-రాజ్ కుమారి హిరానిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డంకి’ని క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇది కూడా తెలుగులో రాబోతోంది. ధనుష్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’కు కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రం డిసెంబరు 15న వస్తుంది. తాజాగా విశ్వక్సేన్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని కూడా డిసెంబరులోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సుధీర్ బాబు చిత్రం ‘హరోం హర’ను కూడా డిసెంబరుకే షెడ్యూల్ చేశారు. మరి ఇన్ని సినిమాలకు డిసెంబరులో ఎక్కడ ఖాళీ ఉందో అర్థం కావడం లేదు.
This post was last modified on July 31, 2023 2:26 pm
కేవలం ఆరు వందల రూపాయలు.. అతనిని ఏడాది పాటు జైలుకి పంపింది. ఆదాయపు పన్ను రిఫండ్ ప్రాసెస్ చేయడానికి రూ.600…
లెజెండరీ నటుడు సాయికుమార్ వారసత్వాన్నందుకుంటూ సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆది సాయికుమార్‌కు కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ…
ప్రభాస్‌తో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరూ తన గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు.. అతను కడుపు పగిలిపోయేలా ఎలా ఫుడ్డు…
గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుకను ప్రకటించారు. గిరిజన…
తెలంగాణ ఉద్యోగులకు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరానికి ఒకరోజు ముందే భారీ కానుకను ప్రకటించింది. గత కొన్నాళ్లుగా ఉద్యోగులు ఎదురు…
ఎన్నో జ్ఞాపకాలు మిగులుస్తూ, ఎన్నెన్నో పాఠాలు నేర్పిస్తూ 2025 సెలవు తీసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ కు సంబంధించి ఈసారి ఉగాది…