నిన్న బేబీ మూడో సక్సెస్ మీట్ చిరంజీవి ముఖ్య అతిధిగా జరిగింది. దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్కెఎన్ తో సహా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మెగాస్టార్ వీర ఫాన్స్ కావడంతో సినిమా కంటే చిరు మీద పొగడ్తల పర్వమే ఎక్కువ కొనసాగింది. ఒక దశలో ఆయనకే మరీ ఇబ్బందిగా అనిపించి తన అభినందన సభలా మార్చారని సరదా చమక్కు కూడా విసిరారు. మూడో వారంలోనూ బేబీ వసూళ్లు స్టడీగా ఉండటంతో వంద కోట్ల గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. వేదికపై చిరు మాట్లాడుతూ హీరోయిన్ వైష్ణవి చైతన్య మీద ప్రశంసల వర్షం కురిపించారు.
సహజమైన నటనతో అచ్చం జయసుధ గారిని గుర్తు చేసిందని కితాబు ఇచ్చారు. నిజానికి ఈ తరానికి ఆవిడ ఎంత గొప్ప నటో తెలియదు. ఆ పాత సినిమాలు ఎంత మంది చూసుంటారు. కానీ అంతే పేరు తెచ్చుకున్న సొందర్యతో పోలిక చేసుంటే కరెక్ట్ గా ఉండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. చిరుతో ఆవిడకు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. రిక్షావోడు పోయినా అన్నయ్య, చూడాలని ఉంది అదిరిపోయే హిట్లు కొట్టాయి. పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిన అమ్మోరు, నరసింహ, 9 నెలలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా సౌందర్యని గుర్తు చేసుకోవాల్సింది.
అలా కాకుండా బ్లాక్ అండ్ వైట్ జమానాలో మొదలైన జయసుధ గారితో కంపేర్ చేయడం న్యాయమే అయినా వైష్ణవికి కాంప్లిమెంట్ ఇవ్వడానికి అంత వెనక్కు వెళ్లాల్సిన అవసరం లేదనేది మెజారిటీ ఒపీనియన్. ఏదైతేనేం చిరంజీవితో ఈ స్థాయిలో పొగిడించుకోవడం అంటే వైష్ణవికి పెద్ద అచీవ్ మెంటే. ఈ ఉద్వేగం స్పీచ్ లోనూ కనిపించింది. స్వయంగా తల్లి తండ్రులను తీసుకొచ్చి స్టేజి మీద పరిచయం చేసి మరీ ఫోటోలు తీయించింది. ఈవెంట్ విజయవంతమయ్యింది కానీ బేబీ కంటెంట్ కన్నా చిరు నామస్మరణతోనే ప్రాంగణం ఊగిపోయిన మాట వాస్తవం
This post was last modified on July 31, 2023 11:40 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…