రౌడీ ఫెలో మూవీతో దర్శకుడిగా మారిన గేయ రచయిత కృష్ణచైతన్య అరంగేట్రంలోనే తన ప్రతిభను చాటుకున్నాడు. కమర్షియల్‌గా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా అదొక ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఛల్ మోహనరంగతో పర్వాలేదనిపించిన కృష్ణచైతన్య.. ఇంకో సినిమా తీయడానికి చాలా సమయమే తీసుకున్నాడు.
నితిన్‌తో పవర్ పేట సినిమాకు అంతా సిద్ధం చేసుకున్నాక బడ్జెట్, ఇతర సమస్యలతో అది ఆగిపోయింది. తర్వాత శర్వానంద్‌తో ఇదే కథను పట్టాలెక్కించాలని చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. చివరికి అతడి కథ యువ కథానాయకుడు విశ్వక్సేన్‌ను ఓకే చేసి సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్రాన్ని మంచి బడ్జెట్లో నిర్మిస్తోంది.. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ సోమవారం లాంచ్ చేయబోతున్నారు.
ఈలోపే ఈ టైటిల్ సోషల్ మీడియాలో రివీల్ అయిపోయింది. విశ్వక్సేన్ 11వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ ఖరారు చేశారట. సినిమా మొదలైనపుడు లంకల రత్న అని వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. కానీ దాని కంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరినే క్యాచీగా ఉంటుందని, ఆ టైటిలే ఖరారు చేసినట్లు సమాచారం. రగ్డ్ లుక్‌లో విశ్వక్ ఫస్ట్ లుక్ ఉండబోతోందట.
గోదావరి ప్రాంతంలోని రౌడీ గ్యాంగ్స్ చుట్టూ తిరిగే పీరియడ్ మూవీ ఇది. ఈ కథను కొన్ని భాగాలుగా తీస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు ఫిక్స్ చేసిన టైటిల్ చూస్తే హిందీలో అనురాగ్ కశ్యప్ తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ గుర్తుకు రాక మానదు. సినిమా కూడా దాన్ని గుర్తుకు చేసేలా రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
This post was last modified on July 30, 2023 10:23 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…