క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా రూపొందిన స్లమ్ డాగ్ హస్బెండ్ ఏకంగా పవన్ కళ్యాణ్ బ్రో ఉందని తెలిసి కూడా ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ కు సిద్ధపడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సరే కంటెంట్ అంత బలంగా ఉందేమో అనుకున్నారు. ట్రైలర్ గట్రా ఏదో కామెడీతో బాగానే ట్రై చేసినట్టు అనిపించింది.పైగా ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారు. స్టార్లు సెలబ్రిటీలు అండగా నిలబడ్డారు. అయినా అంచనాల విషయంలో వెనుకబడిన ఈ వెరైటీ మొగుడు ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టాడు. మరి టాక్ నే నమ్ముకున్న ఈ చిత్రరాజం నిజంగా నవ్వించిందా.
రోడ్ల మీద కళ్లజోళ్లు అమ్ముకునే లక్ష్మణ్(సంజయ్ రావు)కి మౌనిక(ప్రణవి) అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి లవ్. తీరా పెళ్లి కుదిరిన సమయంలో అమ్మాయి జాతక దోషం వల్ల లక్ష్మణ్ బేబీ అనే కుక్క మెడకు తాళి కట్టాల్సి వస్తుంది. సరే అడ్డంకి తొలగిపోయింది కదాని ప్రియురాలికి మూడు ముళ్ళు వేసే సమయంలో పోలీసులు వస్తారు. సదరు కుక్క యజమాని విడాకులు ఇవ్వందే ఒప్పుకోనని కోర్టుకు వెళ్తాడు. అంతే కాదు ఇరవై లక్షలు అడుగుతాడు. దీంతో పెనం నుంచి పొయ్యిలో పడ్డ లక్ష్మణ్ చివరికి ఈ గండం నుంచి ఎలా తప్పించుకున్నాడనేదే అసలైన స్టోరీ
ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన ఏవండీ ఆవిడ వచ్చిందిలో బాబు మోహన్, కోటల కామెడీ ట్రాక్ ని తీసుకుని దర్శకుడు ఏఆర్ శ్రీధర్ ఈ కథను అల్లుకున్నాడు. అక్కడ గాడిద ఇక్కడ కుక్క అయ్యింది. అంతే తేడా. కాకపోతే అవసరానికి మించి అడల్ట్ కామెడీ, బూతులు సీన్లు జొప్పించడంతో పాటు నవ్వించలేని హాస్యంతో విపరీతమైన ల్యాగ్ సహనానికి పరీక్ష పెడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంత మాత్రం రికమండ్ చేసేలా లేదు. క్రియేటివిటీ అంటే కొత్తగా ఆలోచించడం కానీ వింతగా కాదని కొత్త దర్శకులు గుర్తుంచుకుంటే మంచిది. ఫైనల్ గా నవ్విద్దామని వచ్చిన హస్బెండ్ చివరికి నవ్వులపాలయ్యాడు.
This post was last modified on July 30, 2023 12:49 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…