తెలుగులో అత్యంత ఉదారమైన మనస్తత్వం ఉన్న అభిమానులుగా పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ గురించి చెప్పుకోవాలి. వేరే హీరోలతో పోలిస్తే పవన్ ఎంచుకునే కథలు చాలా సాధారణం. అలాగే పవన్ తన సినిమాల మీద పెట్టే ఎఫర్ట్స్ కూడా చాలా తక్కువ. ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన పవన్.. అభిమానుల అభీష్టానికి వ్యతిరేకంగా ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’లో నటించాడు.
ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించి వ్యతిరేకించి అలసిపోయి.. చివరికి రిలీజ్ టైంకి సర్దుకుపోయిన ఫ్యాన్స్.. పవన్ తెర మీద కనిపించడమే మహా భాగ్యం అన్నట్లు ఆ సినిమాను ఎగబడి చూశారు. తర్వాత ‘భీమ్లా నాయక్’ విషయంలోనూ ఇదే రిపీటైంది. ఇంకో రీమేకా అని తిట్టుకుంటూనే దానికీ హైప్ ఇచ్చారు. థియేటర్లను నింపేశారు. కరోనా టైంలో ఉన్నంతలో మంచి కలెక్లన్లే ఇచ్చారు.
ఈ రెండు సినిమాలతో పోలిస్తే ‘బ్రో’ బాగా వీక్ మూవీ. పవన్ అయితే మరీ మొక్కుబడిగా ఈ సినిమా చేసినట్లు అనిపించింది. ఏమాత్రం శ్రమ లేకుండా 20 రోజుల్లో చకచకా సినిమాను లాగించేశాడు. తనను తనే ఇమిటేట్ చేస్తూ.. తన పాటలకు తనే డ్యాన్స్ చేస్తూ అభిమానులకు కొంత కిక్ ఇవ్వడానికి చూసినా.. సినిమాలో కథాకథనాలతో పాటు అన్నీ వీక్‌గానే కనిపించాయి. ఇలాంటి సినిమాలతో సాధారణ ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడం, ఎంగేజ్ చేయడం చాలా కష్టం.
అభిమానులు కూడా ఏదో తప్పదన్నట్లు సర్దుకుపోతున్నారే తప్ప.. వారికి ఈ సినిమా సంతృప్తినివ్వట్లేదు. పవన్ క్యాలిబర్ ఏంటి.. అతను చేస్తున్న సినిమాలేంటి అని ఫీలవుతున్నారు. తాము ఎంత సర్దుకుపోయినా సరే.. మరీ ఇలాంటి సాధారణమైన రీమేక్ సినిమాలతో పవన్ ఎంత కాలం నెట్టుకొస్తాడు అంటున్నారు. ఇకనైనా ఇలాంటివి ఆపేసి కొంచెం ఎఫర్ట్ పెట్టి బలమైన సినిమాలు ఇచ్చి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ అలరించాలని.. మరోసారి రీమేక్ వైపు చూడొద్దని వాళ్లు బలంగా కోరుకుంటున్నారు.
This post was last modified on July 30, 2023 9:29 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…