టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తాడని ఈ మధ్య కొంచెం గట్టిగానే ప్రచారం జరుగుతోంది. బలగం సినిమా తర్వాత తెలంగాణలో రాజు పలుకుబడి మరింత పెరిగిన నేపథ్యంలో ఆయన రాజకీయ అరంగేట్రం గురించి కొంత చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో దిల్ రాజు చేసిన పొలిటికల్ కామెంట్ ఆసక్తి రేకెత్తించింది.
తెలంగాణాలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో సి.కళ్యాణ్ ప్యానెల్‌తో దిల్ రాజు ప్యానెల్ పోటీ పడుతున్న సందర్భంగా దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో దిల్ రాజు మాట్లాడుతూ.. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేసినా ఎంపీగా గెలుస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ తన ప్రాధాన్యం ఎప్పటికీ సినీ రంగానికే అని రాజు తేల్చి చెప్పాడు. సీనియర్లు ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే ఈసారి తాను ఫిలిం చాంబర్ ఎన్నికల బరిలో నిలిచినట్లు రాజు తెలిపాడు.
ఈ ఎన్నికల పోటీలో ఎలాంటి వివాదాలు లేవని.. ఫిలిం ఛాంబర్‌ను బలోపేతం చేయడానికే తమ ప్యానెల్ పోటీలోకి వచ్చిందని ఆయన చెప్పారు. గత మూడేళ్లలో సినిమాలు నిర్మించిన వారే ఛాంబర్లో ఉండాలని తాము కోరితే పాత కార్యవర్గం ఒప్పుకోలేదని.. అందుకే పోటీ అనివార్యం అయిందని.. ఫామ్‌లో ఉన్న నిర్మాతలే తమ ప్యానెల్లో ఉన్నారని.. నిర్మాతల సమస్యలు పరిష్కరించడానికి మంచి టీం అవసరమని రాజు అన్నారు.
ఇప్పటికే హోరాహోరీగా సాగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికల ప్రచారానికి తె పడగా ఆదివారం ఉదయం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నాలుగు గంటలకు కౌంటింగ్ నిర్వహించి సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. ఫిలిం ఛాంబర్లో మొత్తం 1600 మంది సభ్యులుండగా రేపు 900 మంది సభ్యులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
This post was last modified on July 30, 2023 6:11 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…