Movie News

బ్రోలో అంబ‌టి క్యారెక్ట‌ర్.. ప‌వ‌న్ పంచ్‌లు

సినిమాల్లో వ‌ర్త‌మాన రాజకీయ ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబించేలా స‌న్నివేశాలు, డైలాగులు పెట్ట‌డం.. రాజ‌కీయ నాయ‌కుల‌ను గుర్తు తెచ్చేలా క్యారెక్ట‌ర్ల‌ను క్రియేట్ చేయ‌డం కొత్తేమీ కాదు. అందులోనూ రాజ‌కీయాల‌తో ట‌చ్ ఉన్న ఫిలిం స్టార్లు త‌మ రాజ‌కీయ భావ‌జాలానికి త‌గ్గట్లు.. ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేస్తూ సీన్లు రాయించుకోవ‌డం గ‌తంలోనూ చూశాం. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అదే చేశాడు.

బ్రో సినిమాలో సంద‌ర్భానుసారం వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేశాడు. అందులో ముఖ్యంగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. పృథ్వీ చేసిన శ్యామ్ బాబు పాత్రే. ముందు ఇది మామూలు పాత్రే అనుకుంటాం కానీ.. మై డియ‌ర్ మార్కండేయ పాట చూస్తే కానీ అది ఏపీ మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పెట్టిన క్యారెక్ట‌ర్ అని అర్థం కాదు.

ఈ పాట‌లో శ్యాంబాబు పాత్ర‌ మీద సెటైర్లు పడ్డాయి. ఈ పాట‌లో పృథ్వీ గెట‌ప్, ఆయ‌న స్టెప్పులు చూస్తే ఆటోమేటిగ్గా అంబ‌టి రాంబాబు గుర్తుకొచ్చేస్తారు. ఈ ఏడాది సంక్రాంతి సంబ‌రాల్లో భాగంగా రాంబాబు వేసిన స్టెప్పుల తాలూకు వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపుగా అలాంటి టీష‌ర్టే పృథ్వీకి వేయించి స్టెప్పులు కూడా ఇమిటేట్ చేయించారు. స‌డెన్‌గా మ్యూజిక్ ఆపించి..”శ్యాంబాబు పాట ఉన్న టెంపో ఏంటి? నువ్వు వేస్తున్న స్టెప్ ఏంటి?” అని పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకుంటాడు.

అంతే కాక పృథ్వీని ఉద్దేశించి ‘నెక్స్ట్ ఏంటి?’ అని పవన్ అడిగితే… స‌సెక్స్.స అంటాడు శ్యాంబాబు. దీనికి బ‌దులుగా నీకె్పుడూ అదే ధ్యాస‌.. అందరూ మీలాగే ఎప్పుడూ దాని గురించే ఆలోచించరని పవన్ కౌంట‌ర్ వేస్తాడు. అంతే కాక ఈ లలితకళల్ని వదిలేయమని ఘాటుగా చెబుతాడు. థియేట‌ర్లో ఈ స‌న్నివేశాల‌ను బంధించిన ప‌వ‌న్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. వైసీపీ నేత‌ల మీద ప‌వ‌న్ ఇందులో మ‌రికొన్ని పంచులు వేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 29, 2023 10:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యూరిక్ యాసిడ్ సమస్యలకు జీలకర్రతో ఇలా చెక్ పెట్టండి..

ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…

2 hours ago

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

11 hours ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

11 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

12 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

14 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

14 hours ago