ఉప్పెనతో డెబ్యూనే వంద కోట్ల సినిమా అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు త్వరలో రామ్ చరణ్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీ కోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి నేపధ్యంగా హీరో పాత్ర డ్యూయల్ రోలనే లీక్ వచ్చింది కానీ ఎంత వరకు నిజమో తెలియదు. చరణ్ కు శారీరక వైకల్యం ఉండేలా ఏదో షాకింగ్ గా ప్లాన్ చేశారట. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ఖరారైపోయారు. యూనిట్ ఇంకా ప్రకటన ఇవ్వలేదు కానీ మ్యూజిక్ డైరెక్టరే ఇంటర్వ్యూలో చెప్పేసారు కాబట్టి డౌట్ అక్కర్లేదు.
ఇక అసలైన హీరోయిన్ సెలక్షన్ మిగిలుంది. తాజాగా జరిగిన స్లమ్ డాగ్ హస్బెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బుచ్చిబాబు చూచాయగా హింట్ ఇచ్చేశారు. ఏ డైరెక్టర్ అయినా తెలుగు అమ్మాయి దొరికితే అదృష్టంగా భావిస్తాడని, ఉప్పెన కోసం ఎంత ప్రయత్నించినా దొరక్కపోవడంతో రాజీ పడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అందుకే తర్వాతి మూవీ కోసం కాంప్రొమైజ్ కానని తేల్చేశారు. అయితే శ్రీలీల ప్రస్తావన తెచ్చి ఈ అమ్మాయి బాగుందని స్టేజి మీదే కితాబు ఇచ్చేశారు. అక్కడ పక్కనే ఉన్న శ్రీలీల ముసిముసి నవ్వులు నవ్వుకుంది. రెండింటిని లింక్ చేస్తే చర్చ జరిగినట్టే అనిపిస్తోంది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో టాప్ డిమాండ్ లో శ్రీలీల మహేష్ బాబుతో ఆల్రెడీ గుంటూరు కారంలో చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు చరణ్ సరసన కూడా ఓకే అయితే హ్యాట్రిక్ జాక్ పాట్ అవుతుంది. ఎలాగూ బుచ్చిబాబు షూటింగ్ మొదలుపెట్టేనాటికి శ్రీలీల ఇప్పుడు చేస్తున్న వాటిలో ముప్పాతిక ప్రాజెక్టులు పూర్తయిపోతాయి. సో డేట్లు తీసుకోవడం పెద్ద సమస్య కాదు. అడగాలే కానీ అమ్మడు వద్దనే సమస్యే ఉండదు. బుచ్చిబాబుకైనా ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ అంత సులభంగా దొరకదు కదా
This post was last modified on July 29, 2023 1:59 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…