బ్రో రిలీజ్ వల్ల బేబీ థియేటర్లు ఈ రోజు నుంచి చాలా తగ్గిపోయాయి. స్క్రీన్లు తక్కువగా ఉన్న చోట వీకెండ్ వరకు బ్రోతో రీప్లేస్ చేసేలా నిర్మాతలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షోలు నడుస్తున్నాయి. అలా అని బేబీ ఫైనల్ రన్ కు వచ్చిందని కాదు. డిస్ట్రిబ్యూటర్లు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం బ్రోకు వచ్చిన డివైడ్ టాక్ తిరిగి సాయిరాజేష్ బృందానికే బూస్ట్ అవుతుందని, మళ్ళీ సోమవారం నుంచి పికప్ చూడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ 4 రావాల్సిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వాయిదా కలిసి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఛాన్స్ వాడుకునేందుకు బేబీ టీమ్ రెడీ అవుతోంది. ఎడిటింగ్ లో ఇష్టం లేకపోయినా తొలగించాల్సి వచ్చిన 14 నిమిషాల ఫుటేజిని జోడించబోతున్నట్టు తెలిసింది. ఇందులో ఇప్పటిదాకా ఆడియోలో, థియేటర్లో రిలీజ్ చేయని ఏడో పాట ఉండబోతోంది. ఈ కొత్త వెర్షన్ లో ఏఏ సీన్లు ఉంటాయనేది సస్పెన్స్ గా పెట్టారు. లీక్స్ ప్రకారం చూసుకుంటే విరాజ్ అశ్విన్, నాగబాబు, ఆనంద్ తల్లి పాత్రలకు సంబంధించిన ఫినిషింగ్ సరిగా జరగలేదు కాబట్టి వాటిని జోడించవచ్చని అంటున్నారు. దాంతో పాటు వైష్ణవి చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలు కూడా ఉంటాయట.
ఇలా అయితే యూత్ మళ్ళీ బేబీని చూడటం ఖాయం. ఇప్పటికే కాలేజీ కుర్రాళ్లు, ప్రేమజంటలు పుణ్యమాని బోలెడు రిపీట్ రన్లు దక్కించుకుంది. రెండో వారం నుంచి ఫ్యామిలీస్ కూడా బాగా వస్తున్నాయి. అలాంటప్పుడు డైరెక్టర్స్ కట్ పేరుతో వదిలే స్పెషల్ ఎడిషన్ కి రెస్పాన్స్ ఖచ్చితంగా బాగుంటుంది. ఓటిటి హక్కులు కొన్నది ఆహానే కాబట్టి మరీ త్వరగా డిజిటల్ రిలీజ్ కాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆగస్ట్ 10 నుంచి పెద్ద హీరోలు ఒక్కొక్కరుగా దిగుతున్న నేపథ్యంలో ఆలోగా వీలైనంత ఎక్కువ రాబట్టుకోవడమే బేబీ లక్ష్యం. ఇంకో రెండు వారాలు రన్ దొరికినట్టే.
This post was last modified on July 28, 2023 7:21 pm
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…