Movie News

పాత కరెన్సీ చుట్టూ కొత్త సినిమాలు

సుకుమార్ ఏ ముహూర్తంలో రంగస్థలం తీసి 1985 నాటి కథ చెప్పారో అప్పటి నుంచి ఈ ట్రెండ్ ఊపందుకున్న మాట వాస్తవం. దాదాపు తెలుగు తమిళ హీరోలందరూ అలాంటి స్టోరీసే అడిగి మరీ తీయించుకుంటున్నారు. కొన్నిటిలో ఉన్న సారూప్యతలు ఆశ్చర్యం కలిగేలా ఉంటాయి. అదెలాగో చూద్దాం. ఇవాళ దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ లక్కీ భాస్కర్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది. పోస్టర్ లో పాత కాలం వంద నోటుని హైలైట్ చేయడం చూస్తే ఇది ఇప్పటి బ్యాక్ డ్రాప్ కాదనే విషయం స్పష్టంగా అర్థమైపోతుంది .

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా రూపొందబోయే పొలిటికల్ కం మాఫియా థ్రిల్లర్ లోనూ 90ల నాటి డబ్బునే హైలైట్ చేయబోతున్నారు. నిన్న వదిలిన ప్రీ లుక్ లో అదే బయటపడింది. వరుణ్ తేజ్ మట్కా కూడా 1980 కరెన్సీ చుట్టూ తిరిగే గ్యాంబ్లింగ్ గేమ్ మీద నడుస్తుంది. కరుణ కుమార్ హైడ్రామాతో తీస్తున్నారట. ఇలా మీడియం రేంజ్ స్టార్లు ముగ్గురు తెలుగు దర్శకులతో పని చేస్తూ ఓల్డ్ కరెన్సీ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడం విశేషమే. ఇవింకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. వచ్చే నెల నుంచి ఉంటాయి. అటు ఇటు తిరిగి ఇంచుమించు ఒకే టైంలో రిలీజైనా ఆశ్చర్యం లేదు మరి.

క్రియేటివ్ కోణంలో ఆలోచిస్తే  ఇలా డిఫరెంట్ జానర్స్ ని వెలికి తీయడం వల్ల రచయితలకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. అందులోనూ సీనియర్లు సేఫ్ జోన్ కోసం కమర్షియల్ ఫార్మలాకే కట్టుబడిన నేపథ్యంలో ఇలా దశాబ్దాల వెనక్కు వెళ్లడం ద్వారా ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి యూత్ స్టార్లకు కొత్త దారులు కనిపిస్తున్నాయి. పైన చెప్పిన వాటిలో ఒకరు తమిళం మరొకరు మలయాళం హీరో. కానీ తెలుగు మార్కెట్ ని సీరియస్ గా తీసుకుని మన డైరెక్టర్లతో పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదీ ఒకరకంగా మంచిదే. కోలీవుడ్ అమలు చేయాలనుకుంటున్న విచిత్రమైన రూల్స్ కి ఒక సమాధానంలా ఉంటుంది.

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

43 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

2 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

5 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago