కాస్త పేరున్న ఏ సినిమా అయినా తొలి రోజు, తొలి వీకెండ్లో మంచి వసూళ్లే సాధిస్తుంది ఈ రోజుల్లో. కానీ మెజారిటీ చిత్రాలు వీకెండ్ తర్వాత డల్ అయిపోతుంటాయి. పెద్ద హిట్ అనుకున్న సినిమాలు కూడా సోమవారానికి వసూళ్లలో 40-50 శాతం డ్రాప్ చూస్తుంటాయి. కానీ ‘బేబి’ అనే చిన్న సినిమా మాత్రం వీకెండ్లో ఎలా అయితే సెన్సేషనల్ కలెక్షన్లు రాబట్టిందో.. వీకెండ్ తర్వాత కూడా అంతే జోరు చూపించింది.
ఇంకా చెప్పాలంటే తొలి రోజుతో పోలిస్తే వీక్ డేస్‌లో ప్రతి రోజూ మెరుగైన వసూళ్లు రాబట్టింది. సోమవారం నాడు ఐదు కోట్లకు పైగా షేర్ అంటే చిన్న విషయం కాదు. రెండో వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా బలంగా నిలబడింది. ఇప్పుడు ఈ చిత్రం ఒక సెన్సేషనల్ రికార్డు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వరుసగా 13వ రోజు రూ.కోటి కంటే ఎక్కువ షేర్ రాబట్టి సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఏపీ, తెలంగాణల్లో కలిపి కనీసం కోటి రూపాయల షేర్ ఎక్కువ రోజులు సాధించిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ పేరిట రికార్డు ఉంది. ఆ చిత్రం వరుసగా 17 రోజుల పాటు ఈ ఘనత సాధించింది. ‘కేజీఎఫ్-2’ 12 రోజులు వరుసగా ఈ ఘనతను అందుకుని రెండో స్థానంలో ఉండగా.. ‘బేబి’ దాన్ని అధిగమించి రెండో స్థానానికి చేరడం విశేషం.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రాల సరసన ‘బేబి’ లాంటి చిన్న చిత్రం నిలవడం అన్నది ఊహకైనా అందని విషయం. చిన్న సినిమాలు సంచలనం రేపడం కొత్త కాదు కానీ.. ఇది మాత్రం మామూలు సెన్సేషన్ కాదు. ఈ వారం ‘బ్రో’ సినిమా రాకపోతే.. ‘బేబి’ ‘ఆర్ఆర్ఆర్’ను కూడా టచ్ చేసేదేమో. కానీ శుక్రవారం నుంచి ప్రేక్షకుల ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ సినిమా మీదికి మళ్లబోతోంది. ‘బేబి’కి థియేటర్లు బాగా తగ్గిపోయాయి కూడా. కాబట్టి శుక్రవారం నుంచి సినిమాకు కలెక్షన్లు తగ్గిపోవడం పక్కా.
This post was last modified on July 27, 2023 11:23 pm
అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వానికి పంటి కింద రాళ్ల మాదిరిగా విపత్తులు-వివాదాలు ముసురుకుంటున్నాయి. పది మాసాల పాలనలో…
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు చనిపోయిన ఘటన ఏపీలో పెను కలకలం రేపింది.…
'ది రాజా సాబ్' టీజర్ సిద్ధంగా ఉంది, డబ్బింగ్ చెప్పేస్తే అయిపోతుందని ఒక వార్త. 'ఫౌజీ' త్వరగా పూర్తయ్యే సూచనలున్నాయి…
ఇటీవలే విడుదలైన సింగిల్ టీజర్ లో ప్రస్తుత ట్రెండ్ ని అనుసరిస్తూ శ్రీవిష్ణు చేసిన కొన్ని అనుకరణలు వివాదానికి దారి…
రేపు విడుదల కాబోతున్న రెండు పెద్ద సినిమాల మధ్య పోటీని హీరోల పరంగా కాకుండా దర్శకుల కోణం నుంచి చూస్తే…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడింది. మే నెల 2న స్వయంగా భారత దేశ…