టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన కొడుకులిద్దరినీ కూడా సినీ రంగంలోకే తీసుకొచ్చాడు. పెద్ద కొడుకు కాలభైరవ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకుడిగా మారితే.. చిన్న కొడుకు సింహా మాత్రం తమ కుటుంబంలో ఎవ్వరూ వెళ్లని దారిలో వెళ్లి నటుడయ్యాడు. ఈ అన్నదమ్ములు కలిసి అరంగేట్రం చేసిన ‘మత్తు వదలరా’ ఇద్దరికీ మంచి పేరే తెచ్చింది.
కాలభైరవ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సంగీత దర్శకుడిగా బాగానే స్థిరపడ్డాడు. కానీ సింహా మాత్రం గాడి తప్పాడు. అతను తర్వాత చేసిన తెల్లవారితో గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ముఖ్యంగా ఈ నెలలోనే విడుదలైన ‘భాగ్ సాలే’ మరీ పేలవమైన చిత్రంగా పేరు తెచ్చుకుని సింహాతో పాటు కీరవాణి-రాజమౌళి కుటుంబం జడ్జిమెంట్‌నే ప్రశ్నార్థకం చేసింది.
ఐతే తన కెరీర్ డోలాయమానంలో పడ్డ స్థితిలో సింహా మంచి సినిమాతో వస్తున్నట్లున్నాడు. తన కొత్త చిత్రం ‘ఉస్తాద్’ ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని తలపించేలా ఉంది ‘ఉస్తాద్ కథాంశం’. తన బైక్‌ను ఒక స్నేహితుడిలా భావిస్తూ దాంతో కలిసి చేసే భావోద్వేగ ప్రయాణంతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించే ఓ కుర్రాడి కథ ఇది. డొక్కు బైకును నడిపిస్తూ గాల్లో విహరించే ఆ కుర్రాడు.. తర్వాత పైలట్‌గా విమానాన్ని నడిపించే స్థాయికి ఎదుగుతాడు.
ఈ జర్నీని ఎంటర్టైనింగ్‌గా, ఎమోషనల్‌గా డీల్ చేసినట్లున్నాడు కొత్త దర్శకుడు ఫణిదీప్. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇందులో ముఖ్య పాత్ర పోషించడం విశేషం. రవీంద్ర విజయ్, కావ్య కళ్యాణ్ రామ్, అనుహాసన్.. ఇలా మిగతా కాస్టింగ్ కూడా బాగానే కుదిరినట్లుంది. టెక్నికల్‌గా కూడా మంచి సౌండ్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది ‘ఉస్తాద్’. మరి బలమైన కంటెంట్‌తో ఇండిపెండెన్స్ డే వీకెండ్లో భారీ చిత్రాలతో పోటీ పడుతున్న ‘ఉస్తాద్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
This post was last modified on July 27, 2023 7:11 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…