ఈ ఏడాది ప్రారంభం సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కేవలం ఏడు నెలల గ్యాప్ లో భోళా శంకర్ గా రాబోతున్నాడు. వేదాళం రీమేక్, దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు ముందు నుంచి ఈ సినిమా మీద నెగటివ్ వైబ్స్ తీసుకొస్తున్నాయి. దానికి తోడు మహతి స్వరసాగర్ ఇచ్చిన మూడు పాటలు ఓకే అనిపించాయే తప్ప మ్యూజికల్ గా ఆశించిన స్థాయిలో అంచనాలు పెంచలేకపోయాయి. అందుకే హైప్ పెంచాల్సిన బాధ్యత ట్రైలర్ మీద పడింది. ఇందాక రామ్ చరణ్ ద్వారా దీని లాంచ్ ని ఆన్ లైన్ వేదికగా చేశారు.
కోల్కతాలో అమ్మాయిలు కిడ్నాపుకు గురవుతుంటారు. పోలీసులు చేరుకోలేని ఈ గ్యాంగ్ దగ్గరికి టాక్సీ డ్రైవర్ శంకర్(చిరంజీవి) వెళ్లి కాపాడతాడు. ఇలా సంఘసేవ చేస్తూ చెల్లి(కీర్తి సురేష్)తో సంతోషంగా ఉన్న శంకర్ జీవితంలోకి ఒక శత్రువు(తరుణ్ అరోరా) వస్తాడు. అతని ముఠాని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న శంకర్ అసలు ఉద్దేశం ముందు ఎవరికీ అర్థం కాదు. ఇంతకీ ఇతని లక్ష్యం ఏంటి, ఎందుకు ఊచకోతకు తెగబడ్డాడు, సోదరి వెనుక ఉన్న ప్రమాదం లాంటి ప్రశ్నలకు సమాధానం ఆగస్ట్ 11నే తేలనుంది. విజువల్స్ అన్నీ రెగ్యులర్ స్టైల్ లోనే సాగాయి.
దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవి ఎనర్జీని పూర్తిగా వాడుకున్నట్టే కనిపిస్తోంది. వేదాళంకు పెద్దగా మార్పులు చేయకపోయినా చిరు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు సబ్జెక్టుని సెట్ చేసినట్టు అర్థమవుతోంది. యాక్టర్స్ అందరినీ రివీల్ చేశారు. నా వెనుక దునియా ఉందని చిరు చెప్పడం, రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా నటిస్తున్నాడని తమన్నా చెప్పించడం వగైరా అంతా ఫ్యాన్ స్టఫ్ లా పెట్టేశారు. కంటెంట్ కు తగ్గట్టే మహతి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గట్టిగా ఉంది. మాస్ ఎంటర్ టైనర్లు రొటీన్ గా ఉన్నా హీరో స్టామినాతో దర్శకుడి తెలివితో గట్టెక్కిపోతుంటాయి. భోళా శంకర్ లోనూ ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి మరి. చూద్దాం
This post was last modified on July 27, 2023 4:36 pm
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…