ఒకే ఫ్యామిలీ కి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ ఆ సినిమాల వరుస అప్ డేట్స్ తో కన్ఫ్యూజన అవ్వడం సహజమే. అసలే సినిమా నుండి అప్డేట్ వస్తుంది ? ఏ సినిమా సాంగ్ రిలీజైంది ? అనే డైలమాలో ఉంటుంటారు. తాజాగా మెగా ఫ్యాన్స్ కి అలాంటి ఓ కన్ఫ్యూజనే క్రియేట్ అవుతుంది. మేటర్ ఏంటంటే.. ఈ శుక్రవారం పవన్ కళ్యాణ్ , సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే వచ్చే నెల చిరు ‘భోళా శంకర్’ సినిమా థియేటర్స్ ఎంట్రీ ఇవ్వబోతుంది. పవన్ ‘బ్రో’ తో పాటు మరో వైపు భోళా శంకర్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందుతున్నాయి.
అక్కడే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ప్రస్తుతం బ్రో సినిమా రిలీజ్ హంగామాలో ఉంటున్న మెగా ఫ్యాన్స్ మరో వైపు భోళా అప్ డేట్స్ పై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. బ్రో ఈవెంట్ నుండి పవన్ మెనియా మొదలైంది. ఈ సమయంలో చిరు ట్రైలర్ అప్ డేట్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ లో ఎవర్నైనా పట్టుకుని ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే ? వెంటనే చెప్పలేని పరిస్థితి. నిజానికి పవన్ -తేజ్ కాంబో సినిమా ప్రమోషన్స్ నడుస్తున్న ఈ టైమ్ లో వచ్చే నెలలో రానున్న భోళా శంకర్ ప్రమోషన్స్ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.
బ్రో రిలీజ్ తర్వాత చిరు సినిమా ప్రమోషన్స్ మొదలు పెడితే బాగుండేది అంటూ మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎవరి సినిమా అప్ డేట్ వస్తుంది అనే కన్ఫ్యూజన్ పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ మాత్రం నెలకో మెగా మూవీ అంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ముందు తమ్ముడు వెనుక అన్నయ్య అంటూ ఈ సినిమాలపై భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. సో మెగా అభిమానుల్లో ఇటు కన్ఫ్యూజన్ , అటు హ్యాపీ నెస్ రెండూ ఉన్నాయి.
This post was last modified on July 27, 2023 12:13 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…