బ్రో వేడుకలో సోషల్ మీడియాకు కావాల్సిన మీమ్స్ స్టఫ్ పుష్కలంగా దొరికేసింది. కొన్ని సరదా సన్నివేశాలు, ఫన్నీ మూమెంట్స్ వీడియోల రూపంలో వాడేసుకుని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ కు బంధువైన టిజి వెంకటేష్ తన ప్రసంగంలో టీమ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ పొరపాటున సముతిరఖనిని సముద్రాలు, తమన్ ని తమన్నా, సాయి తేజ్ ని ధర్మతేజ, కేతిక శర్మని కీర్తి శర్మగా సంబోధించడంతో నవ్వులు విరిశాయి. కిందపడ్డ మైకుని తీసుకోబోతున్న సాయితేజ్ పక్కనే ఉన్న తమన్ తనకు నమస్కారం చేయబోతున్నట్టు ఫీలై వారించడం పేలింది.
ఇవే కాదు తమన్ ప్రాంగణంలోకి వచ్చాక వెరైటీగా నమస్కారం పెట్టడం, బ్రహ్మానందం మాట్లాడుతూ పవన్ ని ఐ లవ్ బ్రో అంటూ పదే పదే చెబుతూ నవ్వులు పూయించడం ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. పవన్ స్పీచ్ మధ్యలో వైష్ణవ్ తేజ్ వెనుక నుంచి చెవిలో ఏదో చెప్పబోతే నాకు గుర్తుందంటూ పవన్ కాసింత సీరియస్ గా చూడటం బాగుంది. ఇలా ఆహ్లాదకమైన హాస్యంతో వేడుక చక్కని టైం పాస్ చేయించింది. పవన్, తేజు, తమన్ ముగ్గురు కలిసి తమ్ముడు పంచె గెటప్ లో కిల్లి కిల్లి సాంగ్ కి డాన్సు చేసిన వీడియోని ప్లే చేయడం ఊహించని స్పెషల్ సర్ప్రైజ్.
క్షణాల్లో ఇవన్నీ ట్విట్టర్ అదే ప్రస్తుతం ఎక్స్ గా పేరు మార్చుకున్న సోషల్ మీడియాలో దిగిపోయాయి. ఆలస్యంగా ప్రారంభమై బయట వర్షం పడుతున్నా అభిమానులు లెక్క చేయకుండా తండోప తండాలుగా వచ్చారు. వాళ్ళను నిరాశ పరచకుండా పవన్ అరగంటకు పైగానే మాట్లాడ్డం మంచి జోష్ ఇచ్చింది. వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. ఇంకో రెండే రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందాల కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ కొంత ఆలస్యంగా మొదలుపెట్టడం షాక్. తెలంగాణ, ఏపీలో క్రమంగా ఆన్ లైన్ బుకింగ్ లో స్క్రీన్లు పెంచుతున్నారు.
This post was last modified on July 26, 2023 8:20 am
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…