శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా సినిమా రానున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు శేఖర్ కమ్ముల. కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం స్క్రిప్టింగ్ చేస్తున్న కమ్ముల ఇందులో ఒక గెస్ట్ రోల్ క్రియేట్ చేశారట. సినిమాలో ఒక ఇంపార్టెంట్ సిట్యువేషన్ లో ఆ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందట.
ఆ క్యామియో నాగార్జునతో చేయించాలని భావిస్తున్నారట. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించాడు నాగ్. ఇప్పుడు మరో తమిళ హీరో తో కలిసి నటించినున్నాడు. శేఖర్ కమ్ముల, నిర్మాత సునీల్ ఇప్పటికే నాగార్జున ని కలిసి ఈ కామియో గురించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట. ప్రస్తుతం బిగ్ బాస్ షో తో బిజీగా ఉన్నాడు నాగార్జున.
సార్ తో తెలుగులో మంచి విజయం అందుకున్న ధనుష్ ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందకు స్ట్రెయిట్ సినిమాతో రాబోతున్నాడు. అన్ని భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో ధనుష్ కి హీరోయిన్ గా రష్మిక ని తీసుకోనున్నారని తెలుస్తుంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని టాక్.
This post was last modified on July 25, 2023 8:54 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…