సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2005 లో వచ్చిన చంద్రముఖిని ఫ్యాన్సే కాదు మూవీ లవర్స్ ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. లకలకలక అంటూ భయపెట్టిన తీరు సంవత్సరాల తరబడి ఆడియన్స్ ని వెంటాడింది. ఎప్పుడో వచ్చిన మలయాళం మూవీకి రీమేక్ అయినప్పటికీ దర్శకుడు పి వాసు దాన్ని తీర్చిదిద్దిన తీరు హారర్ కామెడీలో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన మాట వాస్తవం. పద్దెనిమిదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. లారెన్స్ హీరోగా కంగనా రౌనత్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో లైకా సంస్థ ప్యాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తోంది.
మొదటి భాగానికి సంగీతమందించిన విద్యాసాగర్ కాకుండా ఈ సారి ఆ బాధ్యతను ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణికి అప్పజెప్పారు. ఆయన దీని రీ రికార్డింగ్ కోసం రెండు నెలలుగా నిద్రలేని రాత్రులతో కసరత్తు చేస్తున్నారు. చంద్రముఖి 2 వణుకు పుట్టించేలా ఉందని, మతి పోగొట్టే సన్నివేశాలకు రీ రికార్డింగ్ చేయాలంటేనే భయంగా ఉందని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అంతే కాదు కన్నడ వెర్షన్ కు మ్యూజిక్ ఇచ్చిన గురుకిరణ్, తమిళంకు పని చేసిన విద్యాసాగర్ ఇద్దరినీ తనను ఆశీర్వదించమని విన్నవించడం కొసమెరుపు. దీన్ని బట్టే అవుట్ ఫుట్ ఓ రేంజ్ లో వస్తోందని అర్థం చేసుకోవచ్చు
సెప్టెంబర్ 19 విడుదల కాబోతున్న చంద్రముఖి 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మాములుగానే లారెన్స్ దెయ్యం సినిమాలకు మాస్ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అలాంటిది రజని బ్రాండ్ దానికి తోడవ్వడంతో హైప్ ఓ రేంజ్ లో ఉంటుందనే ముందస్తు విశ్లేషణలు మొదలయ్యాయి. ఇందులో జ్యోతిక స్థానంలో వచ్చిన కంగనా తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిందనే టాక్ యూనిట్ నుంచి వినిపిస్తోంది. నిజానికి చంద్రముఖి కొనసాగింపునే వెంకటేష్ నాగవల్లిగా తీశారు కానీ ఆది ఫ్లాప్ అయ్యింది. అందుకే టైటిల్ ని మార్చకుండా నెంబర్ తగిలించి ఇలా సెట్ చేసుకున్నారు.
This post was last modified on July 24, 2023 3:02 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…