దేశ రక్షణ కోసం గాండీవధారి సాహసం

2023 సంవత్సరం యూత్ హీరోల గూఢచారి సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తోంది. ఇప్పటికే అఖిల్ ఏజెంట్, నిఖిల్ స్పైలు ఈ బ్యాక్ డ్రాప్ లో పలకరించాయి. ఆశించిన ఫలితాలు అందుకోనప్పటికీ వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. కెరీర్ లో మొదటిసారి కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న మెగా ప్రిన్స్ ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు. ఆగస్ట్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ లో సాక్షి వైద్య హీరోయిన్ కాగా మిక్కీ కె మేయర్ సంగీతం సమకూర్చారు. ఇందాక టీజర్ ని లాంచ్ చేశారు.

కథేంటో చిన్న క్లూస్ ఇచ్చారు. అర్జున్(వరుణ్ తేజ్) లైఫ్ ని రిస్క్ లో పెట్టి అయినా సరే దేశం కోసం ఎంత దూరమైనా వెళ్లే గూఢచారి. దేశ భద్రతకు సంబంధించిన ఒక ముఖ్యమైన మిషన్ బాధ్యతను  అతనికి అప్పగిస్తారు. అయితే మొండిగా తనకు తోచిందే చేసుకుంటూ తప్పు అనిపిస్తే చాలు ఎంత విధ్వంసానికైనా తెగబడే అర్జున్ తో పని చేయడం చాలా ప్రమాదమని కొలీగ్స్ భావిస్తారు. వాళ్ళలో ప్రియురాలు (సాక్షి వైద్య) కూడా ఉంటుంది. ఇంతకీ అతను ఎంచుకున్న టార్గెట్ ఎవరు, అతి పెద్ద పద్మవ్యూహం నుంచి ఇండియాను ఎలా కాపాడాడు అనేది తెరమీద చూడాలి.

విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. టేకింగ్ పరంగా ప్రవీణ్ సత్తారు హాలీవుడ్ ప్రమాణాలను పాటించినట్టు కనిపిస్తోంది. ఛేజులు, బ్లాస్టులు, ఫైట్లు వగైరా చూస్తుంటే చాలా సీరియస్ జానరే ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. ముఖేష్ ఛాయాగ్రహణం, మిక్కీ జె మేయర్ బిజిఎం బాగా కుదిరాయి. నాజర్, విమలా రామన్, రవి వర్మ, మనీష్ చౌదరి, అభినవ్ గోమటం, నరైన్, రోషిని ప్రకాష్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన గాండీవధారి అర్జునకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో, ప్రమాదం అంచుల దాకా వెళ్లి ఆడుకునే తన సాహసం ఏ లక్ష్యానికి చేరువ చేసిందో ఇంకో నెల రోజులు ఆగితే థియేటర్లో చూడొచ్చు